Peddi: రాంచరణ్ కంటే ముందు మెగా ఫ్యామిలీలో స్పోర్ట్స్ మూవీస్ చేసిన హీరోలు.. సూపర్ హిట్స్ కొట్టింది ఇద్దరే

Published : Jun 06, 2026, 07:52 AM IST

రాంచరణ్ కంటే ముందుగా మెగా ఫ్యామిలీలో కొందరు హీరోలు స్పోర్ట్స్ సినిమాల్లో నటించారు. అయితే సూపర్ హిట్స్ అందుకుంది మాత్రం ఇద్దరే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్పోర్ట్స్ సినిమాల జాబితా ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
16
మెగా పవర్ స్టార్ రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ 4న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాంచరణ్ తన కెరీర్ లో తొలిసారి స్పోర్ట్స్ యాక్షన్ సినిమా చేశారు. రాంచరణ్ నటనకు ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో చరణ్ థియేటర్స్ లో కంటతడి పెట్టిస్తున్నారు. తొలి రోజు ఈ చిత్రం 135 కోట్లు వసూలు చేసి కలెక్షన్ల విధ్వంసం సృష్టించింది. ఇదే జోరు కొనసాగితే పెద్ది సూపర్ హిట్ కావడం ఖాయం. ఇదిలా ఉండగా రాంచరణ్ కంటే ముందు మెగా ఫ్యామిలీలో హీరోలు స్పోర్ట్స్ సినిమాల్లో నటించారు. అయితే కేవలం ఇద్దరు మాత్రమే సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

26
చిరంజీవి - విజేత

రాంచరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి 1985లోనే స్పోర్ట్స్ మూవీలో నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి విజేత అనే మూవీ చేశారు. ఈ మూవీలో చిరు తన దేశానికీ ప్రాతినిధ్యం వహించాలి అని కలలు కనే ఫుట్ బాల్ ఆటగాడిగా నటించారు. తన ఫ్యామిలీ కోసం ఫుట్ బాల్ కెరీర్ ని పక్కన పెట్టి కిడ్నీని సైతం హీరో త్యాగం చేస్తాడు. ఈ మూవీల్లో చిరు ఎమోషనల్ పెర్ఫార్మెన్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది.

36
పవన్ కళ్యాణ్ - తమ్ముడు

మెగా ఫ్యామిలిలో చిరంజీవి తర్వాత ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పోర్ట్స్ మూవీలో నటించారు. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు చిత్రంలో పవన్ కళ్యాణ్ బాక్సర్ గా నటించారు. బాక్సింగ్ కోసం పవన్ కసరత్తు చేసే సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. 1999లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో పవన్ కొన్ని రియలిస్టిక్ స్టంట్స్ చేశారు.

46
సాయిధరమ్ తేజ్ - విన్నర్

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన విన్నర్ చిత్రం స్పోర్ట్స్ సినిమానే అనే చెప్పాలి. ఈ చిత్రంలో తేజు గుర్రపు పందేలతో పాల్గొనే జాకీగా నటించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

56
వరుణ్ తేజ్ - గని

వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. వరుణ్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఏమాత్రం వర్కౌట్ కాలేదు.

66
రాంచరణ్ - పెద్ది

రాంచరణ్ కంటే ముందు ఆ ఫ్యామిలిలో స్పోర్ట్స్ సినిమాలతో చిరు, పవన్ మాత్రమే విజయాలు అందుకున్నారు. ఇప్పుడు పెద్ది చిత్రంతో చరణ్ ఆ జాబితాలో చేరారు. ఈ మూవీలో రాంచరణ్ క్రికెటర్ గా, కుస్తీ వీరుడిగా, రన్నర్ గా నటించారు. క్రాసోవర్ అథ్లెట్ గా చరణ్ నటన అద్భుతం అనే చెప్పాలి. ఈ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో చరణ్ క్రేజ్ మరోసారి పెరిగింది.

Read more Photos on
click me!

Recommended Stories