‘ఆదిపురుష్’తో ప్రభాస్.. వెండితెరపై ఇప్పటి వరకు రాముడిగా నటించిన హీరోలు వీరే

First Published | Jun 15, 2023, 5:29 PM IST

‘ఆదిపురుష్’తో ప్రభాస్ అలరించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వెండితెరపై టాలీవుడ్ హీరోలు రాముడి పాత్రలో ఆకట్టుకున్నారు. వారి నటనకు బ్రహ్మండమైన ప్రేక్షాదరణ దక్కింది. వారెవరో ఆ సినిమాలేంటో తెలుసుకుందాం. 
 

తెలుగు ప్రేక్షకులకు రాముడంటే ఎలాంటి సందేహం లేకుండా చెప్పే పేరు దివంగత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామరావు (Sr NTR). ఎన్నో పాత్రలో మెప్పించిన అన్నగారు రాముడి పాత్రలో దైవస్వరూపంలా మెరిశారు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో తొలిసారిగా రాముడిగా కనిపించారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామ పట్టాభిషేకం’లోనూ రాముడి పాత్రలో అలరించారు. ఆయన రాముడి వేషం కడి ప్రేక్షకులు వెండితెరకే హారతి ఇచ్చారంటే ఎంతలా ఇష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. 
 

అన్నగారి కంటే ముందే అక్కినేని నాగేశ్వర్ రావు కూడా రాముడి పాత్రలో అలరించారు. తొలిచిత్రంతోనే రాముడిగా అందరి ప్రశంసలు అందుకోవడం విశేషం. 1944లో వచ్చిన ‘శ్రీ సీతారామ జననం‘ చిత్రంలో Akkineni Nageswara Rao రాముడిగా అలరించారు. ఫస్ట్ సినిమానే రాఘవుడి పాత్రలో ఒదిగిపోయారు. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందారు. 
 


తెలుగు చిత్ర పరిశ్రమలో రాముడి పాత్రలో చాలా మంది అగ్ర నటులు నటించారు. కానీ మొట్టమొదటి సారిగా రాముడి వేషం కట్టి ప్రేక్షకులను మెప్పించింది మాత్రం నటుడు యడవల్లి సూర్యనారాయణనే. బాదామి సర్వోత్తం డైరెక్షన్ లో 1932లో వచ్చిన ‘పాదుకా పట్టాభిషేకం’ చిత్రంతో అలరించడం విశేషం. 

తెలుగు సినీ రంగంలో అగ్ర నటులలో ఒకరైనా, అందగాడైన శోభన్ బాబు (Shobhan Babu)  కూడా రాముడి పాత్రలో కనిపించారు. రాఘవుడి పాత్రలో జీవించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1971లో దర్శక దిగ్గజం బాపు తెరకెక్కించిన ‘సంపూర్ణ రామాయణం’లో రాముడిగా నటించారు. 

టాలీవుడ్ ప్రత్యేకమైన చిత్రాల్లో నలిచిన చిత్రం ‘శ్రీ రామదాసు’. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ రాముడిగా అలరించారు. అలాగే ‘దేవుళ్లు’ సినిమాలో శ్రీకాంత్ కూడా రాముడి వేషం కట్టారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 

నందమూరి నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న.. నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)  సైతం -శ్రీ రామరాజ్యం’లో చిత్రంలో రాముడిగా మెప్పించారు. 2011లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

అలాగే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)  కూడా రాముడిగా వెండితెరపై మెరిశారు. గుణశేఖర్ దర్శకత్వంలో 1997లో వచ్చిన ‘బాల రామాయణం’లో తారక్ బాల రాముడిగా అలరించారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కించారు. 
 

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  ఆ రాఘవుడి పాత్రలో నటించడం విశేషం. ‘ఆదిపురుష్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను త్రీడీలో చూపించబోతున్నారు. భారీ విజువల్స్, గ్రాఫిక్, సీజీ, యాక్షన్ తో అబ్బురపరిచే దృశ్యాలను చూపించబోతున్నారు. రేపు (జూన్ 16)న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

Latest Videos

click me!