ఇక వెండితెరపైనా అలరించాలనే శ్రీముఖి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల్లో చెల్లెలుగా, ఫ్రెండ్ పాత్రలో నటించిన శ్రీముఖి.. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతోనైనా ఈ బ్యూటీకి వెండితెరపై అడుగులేసే దారి సుగుమం అవ్వాలని అభిమానులు ఆకాంక్షించారు.