గురువులకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సమానంగా స్థానం కల్పించిన సంసృతి మనది. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రతి ఏటా మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. గురువుల గొప్పతరం వివరించేలా వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. అంతే కాదు గురువులని కామెడియన్లుగా చూపించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక అందాలు ఒలకబోసే హీరోయిన్లు సైతం పంతులమ్మలుగా నటించి మెప్పించారు. అయితే కొన్ని చిత్రాల్లో హీరోయిన్లు టీచర్స్ గా నటించినప్పటికీ ఆ పాత్రలని కేవలం గ్లామర్ కోసమే వాడుకోవడంతో విమర్శలు మూటగట్టుకున్నారు.