Ram Charan Vs Yash: చెలరేగిన వివాదం.. రాంచరణ్ Vs యష్, ఇదెక్కడి గొడవ అంటున్న కామన్ ఫ్యాన్స్

Published : Apr 17, 2022, 01:28 PM IST

కెజిఎఫ్ 2 ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కేజిఎఫ్ మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగం అదరగొట్టడంతో థియేటర్స్ యష్ నామ స్మరణతో మోతెక్కుతున్నాయి. 

PREV
16
Ram Charan Vs Yash: చెలరేగిన వివాదం.. రాంచరణ్ Vs యష్, ఇదెక్కడి గొడవ అంటున్న కామన్ ఫ్యాన్స్
Ram Charan

కెజిఎఫ్ 2 ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కేజిఎఫ్ మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగం అదరగొట్టడంతో థియేటర్స్ యష్ నామ స్మరణతో మోతెక్కుతున్నాయి. ప్రశాంత్ నీల్ అద్భుతమైన ఎలివేషన్స్ సీన్స్ తో మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా కెజిఎఫ్ 2 చిత్రాన్ని తీర్చి దిద్దారు. కెజిఎఫ్ 2 తో యష్ తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. 

 

26
Ram Charan

అలాగే మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్ నటించిన అల్లూరి పాత్ర హిందీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చేసింది. రాజమౌళి రాంచరణ్ పాత్రని శ్రీరాముడి తరహాలో ప్రొజెక్ట్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. 

 

36
Ram Charan

ఇదిలా ఉండగా ఈ ఇద్దరి క్రేజీ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఊహించని వివాదం చెలరేగింది. దీనితో సోషల్ ట్విటర్ లో #RamVsYash హ్యాష్ ట్యాగ్ ఒక రేంజ్ లో ట్రెండింగ్ గా మారింది. యష్, రాంచరణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ షురూగా అయ్యాయి. 

46
Ram Charan

అసలు ఈ హీరోల అభిమానుల మధ్య చెలరేగిన వివాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వీళ్ళిద్దరిలో బియర్డ్(గడ్డం) లుక్ ఎవరికి బాగా సెట్ అవుతుందనేది వీళ్ళ గొడవ. దీనితో రాంచరణ్ బియర్డ్ లుక్ ఉండే ఫోటో.. యష్ కెజిఎఫ్ లుక్ తో ఫ్యాన్స్ టెండింగ్ మొదలు పెట్టారు. వీళ్ళిద్దరిలో బియర్డ్ బాస్ ఎవరు అంటూ ట్రెండ్ చేస్తున్నారు. 

56
Ram Charan

కామన్ ఫ్యాన్స్, ప్రేక్షకులు మాత్రం ఈ తరహా ఫ్యాన్ వార్స్ తో విసిగిపోతున్నారు. ఇద్దరూ సౌత్ సూపర్ స్టార్స్. ప్రతిభతో ఎదిగినవాళ్లు. ఇలాంటి ఫ్యాన్ వార్స్.. బియర్డ్ వార్స్ అనవసరం అంటున్నారు. కొందరు మాత్రం యష్, రాంచరణ్ ఇద్దరూ తిరుగులేని నటులు.. కానీ బియర్డ్ లుక్ యష్ కి బాగా సెట్ అవుతుంది. 

66
KGF

మరికొందరు రాంచరణ్ కి బియర్డ్ లుక్ బాగా సెట్ అవుతుందని అంటున్నారు. కేజిఎఫ్ రెండు భాగాల్లో యష్ బియర్డ్ లుక్ తో అదరగొట్టాడు. ఇక రాంచరణ్ రంగస్థలం చిత్రంలో, ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బియర్డ్ లుక్ లో మెరిశాడు.  

click me!

Recommended Stories