Samantha Hot Workouts: జిమ్‌లో హాట్‌ వర్కౌట్స్ తో పిచ్చెక్కిస్తున్న సమంత.. ఇది వీర లెవల్‌..

Published : Apr 17, 2022, 12:04 PM IST

సమంత ఇటీవల అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటోంది. ఆమె చేసే ఫోటో షూట్లు దుమారం రేపుతున్నాయి. అంతగా తనకు ఎలాంటి హద్దుల్లేవని చాటుకుంటోంది నాగచైతన్య ఎక్స్ వైఫ్‌. స్వేచ్ఛగా ముందుకు సాగుతుంది. 

PREV
19
Samantha Hot Workouts: జిమ్‌లో హాట్‌ వర్కౌట్స్ తో పిచ్చెక్కిస్తున్న సమంత.. ఇది వీర లెవల్‌..
samantha workouts

సమంత(Samantha) లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోని పంచుకుంది. ఇందులో ఆమె వర్కౌట్‌ డ్రెస్‌లో కనిపించడం విశేషం. బిగుబైన షాట్‌, బ్రాలో రెచ్చిపోయింది సమంత. తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. వర్కౌట్‌ చేస్తూ ఇంతటి హాట్‌గా కనిపించొచ్చో చూపిస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఏలేస్తుంది. 

29

సమంత జిమ్‌ వర్కౌట్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. నెటిజన్లని, ముఖ్యంగా సమంత అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. తన ఘాటెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తుంది. సమంత ఈ రేంజ్‌లో వర్కౌట్‌ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. Samantha Workouts 

39

సమంత ఈ సందర్భంగా పెట్టిన పోస్ట్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తనకు 2022, 23 చాలా క్రూషియల్‌ అట. ఫిజికల్‌గా చాలా డిమాండింగ్‌ ఉంటుందని, చాలా సవాళ్లతో కూడుకున్నదని, అందుకే చాలా స్ట్రాంగ్‌ తయారవుతున్నానని చెప్పింది సమంత. ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా మారుతున్నట్టు చెప్పింది సమంత. 
 

49

సమంత ఇప్పుడు వరుస సినిమాలతో ఉంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. అందులో భాగంగా కొన్నింటిలో యాక్షన్‌ కూడా చేయబోతుందని సమాచారం. వాటి కోసమే సమంత ఇలా బలంగా తయారవుతుందట. బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలని భావిస్తుందట. పైగా వీడియోల్లో చూస్తుంటే సమంత కాస్త బరువెక్కినట్టుంది. అన్ని రకాలుగా సమంత మరింత ఫిట్‌గా రెడీ అవుతుందని చెప్పొచ్చు. 

59

ప్రస్తుతం సమంత `శాకుంతలం` చిత్రంలో నటించింది. ఇది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. మరోవైపు `యశోద` చిత్రంలో మరో మెయిన్‌ లీడ్‌గా చేస్తుంది. ఈ చిత్రం కూడా రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం విశేషం. అలాగే తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి నటించింది. ఈ చిత్రం కూడా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇది తెలుగులోనూ విడుదల కాబోతుంది. మరోవైపు డ్రీమ్‌ వారియర్స్ లో మరో సినిమాకి కమిట్‌ అయ్యింది సమంత. 

69

దీంతోపాటు  `అరెంజ్‌మెంట్‌ ఆఫ్‌ లవ్‌` అనే ఇంటర్నేషనల్‌ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె బై సెక్సువల్‌ అమ్మాయిగా కనిపించనుందని టాక్‌. ఈ సినిమాతో సమంత రేంజ్‌ మారబోతుందని అనుకుంటున్నారు. అలాగే `ది ఫ్యామిలీ మ్యాన్‌ 3`కి ప్లాన్‌ జరుగుతుందట. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేయబోతుందట. 

79

ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు ముంబయికి షిఫ్ట్ అయ్యింది. నాగచైతన్యతో విడిపోయిన అనంతరం హైదరాబాద్‌లో ఉంటే ఇంకా ఆ జ్ఞాపకాలే గుర్తొస్తాయని భావించిందో, లేక బాలీవుడ్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టిందో ఏమోగానీ ఇప్పటికే ఆమె ముంబయికి షిఫ్ట్ అయ్యిందని తెలుస్తుంది. 
 

89

అంతేకాదు అక్కడ ఓ ఇళ్లు కూడా కొనుగోలు చేసిందట. మూడు కోట్లతో లగ్జరీ ఫ్లాట్‌ని కొన్నట్టు సమాచారం. అంతేకాదు తన మేనేజర్‌ని కూడా మార్చిందట. నాగచైతన్యకి, సమంతకి ఒకే మేనేజర్‌ ఉండటంతో ఆయన స్థానంలో ముంబయికి చెందిన మేనేజన్‌ని నియమించుకుందని సమాచారం. 
 

99

`ఏం మాయ చేసావె` చిత్రంతో కలిసిన సమంత, నాగచైతన్య దాదాపు ఏడేళ్ల తర్వాత 2017లో అక్టోబర్‌ 6న మ్యారేజ్‌ చేసుకున్నారు. సరిగ్గా నాలుగేళ్లు తర్వాత విడిపోతున్నట్టు ప్రకటించారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటనేది తెలియదు. ప్రస్తుతం సమంత తన కెరీర్‌వైపు ఫోకస్‌ పెట్టింది. వరుసగా సౌత్‌ టూ నార్త్, ఇంటర్నేషనల్‌ మూవీస్‌ చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories