Anasuya:అనసూయపై ఇలాంటి కామెంట్లేంటి?.. `జబర్దస్త్` యాంకర్‌ నిజంగానే వాటిని పట్టించుకోవడం లేదా?

Published : Apr 17, 2022, 01:21 PM ISTUpdated : Apr 17, 2022, 01:22 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ.. టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ బిజీగా ఉంది. ఆమె అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కాదు, తనే లీడ్‌గానూ సినిమాలు చేస్తుంది. 

PREV
18
Anasuya:అనసూయపై ఇలాంటి కామెంట్లేంటి?.. `జబర్దస్త్` యాంకర్‌ నిజంగానే వాటిని పట్టించుకోవడం లేదా?

`బజర్దస్త్`(Jabardasth) కామెడీ షోకి యాంకర్‌గా చేసి తన అందచందాలతో ఆకట్టుకుంది అనసూయ(Anasuya). యాంకర్‌గా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. `జబర్దస్త్` షోకి గ్లామర్‌ టచ్‌ ఇస్తూ సెక్సీ యాంకర్‌గా ఆద్యంతం అలరిస్తూ, బుల్లితెరపై రచ్చ చేస్తుంది. మరోవైపు ఈ షోల పేరుతో ప్రతి వారం పొట్టి దుస్తుల్లో ఫోటో షూట్‌ నిర్వహిస్తూ వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ నిత్యం వారిని ఎంగేజ్‌ చేస్తుంది అనసూయ.  

28

సోషల్‌ మీడియాలో అనసూయ అందాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఫోటో షూట్ పిక్స్ కోసం లక్షలాది నెటిజన్లు, అభిమానులు ఆమె కోసం వెయిట్‌ చేస్తుంటారంటే అతిశయోక్తి కాదు. వారికోసం అనసూయ సైతం అదే మాదిరిగా మరింత హాట్‌గా, సెక్సీగా ముస్తాబై పోజులిసతూ వారిని మాయ చేస్తుంది. అందంతో కట్టిపడేస్తుంటుంది. 

38

అనసూయ టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ రాణిస్తుంది. `రంగస్థలం`లో రంగమ్మత్తగా మెప్పించింది అనసూయ. ఈ చిత్రంతో ఆమె పాత్రకి విశేషమైన గుర్తింపు పేరు వచ్చింది. టాలీవుడ్‌లో ఇలాంటి  స్పెషల్‌ రోల్స్ కి అనసూయ బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె కోసం స్టార్‌ హీరోల సినిమాల ఆఫర్స్ ప్రధానంగా వస్తుండటం విశేషం. 

48

ఆ మధ్య `పుష్ప`, `ఖిలాడీ` చిత్రాల్లో నటించింది. తన పాత్ర మేరకు ఆకట్టుకుంది. అయితే బలమైన పాత్ర, రంగమ్మత్త తరహా పాత్ర అనసూయకి దక్కలేదు. ఈ నేపథ్యంలో తనే లీడ్‌గా `దర్జా` అనే మూవీలో నటిస్తుంది అనసూయ. ఇందులో ఆమెది పూర్తిగా నెగటివ్‌ రోల్‌. ఇటీవల విడుదలైన టీజర్‌ లో అనసూయ తన విశ్వరూపం చూపించింది. నెగటివ్‌ షేడ్‌లో అదరహో అనిపించింది. 

58

నటిగా కేవలం టీజర్‌, ఇతర ప్రచార చిత్రాల్లో ఆకట్టుకున్న అనసూయపై ఇప్పుడు టాలీవుడ్‌లో కొన్ని నెగటివ్‌ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఈసినిమా ప్రమోషన్స్ కి సపోర్ట్ చేయడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఆమె కనిపించలేదు. నిర్మాతలు ఆమెని అప్రోచ్‌ అయి, పాల్గొనాలని కోరినా తాను రాలేనని తేల్చి చెప్పినట్టు సమాచారం.  కేవలం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ఇంటర్వ్యూలకు మాత్రమే వస్తానని, చిన్న చిన్న ప్రెస్‌మీట్‌లకు రాలేనని చెప్పిందట. 

68

అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` సినిమా సమయంలో దాదాపు అన్ని ఈవెంట్లలోనూ పాల్గొంది అనసూయ. దీంతో పెద్ద సినిమాలకు ఒక న్యాయం, చిన్న చిత్రాలకు మరో న్యాయమా? అని సదరు చిత్ర నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట, చిన్న సినిమాలు అనసూయకి పట్టవా? అంటూ లోలోపల మదన పడుతున్నారట. అనసూయ వ్యవహారంపై తమ సన్నిహిత వర్గాల వద్ద వాపోతున్నట్టు సమాచారం. 
 

78

అయితే అనసూయ చాలా బిజీ నటి. ఆమె అరడజను సినిమాల్లో నటిస్తుంది. పైగా `జబర్దస్త్` షోని చేయాల్సి ఉంటుంది. క్షణం తీరిక లేకుండా ఉంటుంది. వీటికితోడు తన ఫ్యామిలీని చూసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి మధ్య ఆమె `దర్జా` సినిమాకి టైమ్‌ కేటాయించలేకపోతున్నట్టు టాక్‌. అయినా చిన్న చిత్రాలకు పాపులారిటీ ఉన్న ఆర్టిస్టులు ప్రమోట్‌ చేస్తేనే జనాల్లోకి వెళ్తాయి. లేదంటే కిల్‌ అయిపోతాయి. ఆ సినిమా ఆడకపోతే అందులో నటించిన ఆర్టిస్టులకు కూడా బ్యాడ్‌ ఇమేజ్‌ వస్తుంది. వారి మార్కెట్‌ పడిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

88

పెద్ద సినిమాల కోసమే స్టార్‌ హీరోలు సైతం వరుసగా ప్రమోషన్‌లో పాల్గొంటూ తమ సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు తపిస్తున్నారు. శ్రమిస్తున్నారు. అలాంటిది చిన్న సినిమాలకు ఆర్టిస్టుల అవసరం మరింతగా ఉంటుంది. ఎక్కువగా ప్రచారం చేస్తేసే సినిమా నిలబడుతుంది. లేదంటే కిల్‌ అయిపోతుంది. ఇప్పుడు `దర్జా` విషయంలో నిర్మాతలు ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి వారి బాధని అనసూయ అర్థం చేసుకుంటుందా? అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories