సడెన్‌గా ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని టీమ్ వెల్లడించింది. `అమెజాన్ ప్రైమ్‌లో ‘బరాబర్ ప్రేమిస్తా’ సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కి మంచి స్పందన వస్తోంద`ని టీమ్ చెప్పింది. ఈ సినిమాలో ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీకి కథని ఎంఏ తిరుపతి, మాటలు రమేష్ రాయ్ అందించారు. వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, ఆర్ఆర్ ద్రువన్ సంగీత దర్శకుడిగా పని చేశారు, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.