అభిషేక్ బచ్చన్ పెళ్లి నాటి నగలకి, ఈ మధ్యే మెట్ గాలాలో ఈశా అంబానీ ధరించిన ఆభరణానికి మధ్య ఉన్న పోలిక సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బచ్చన్ కుటుంబం తమ వారసత్వ నగలను అంబానీలకు అమ్మేసిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వింత చర్చ కార్చిచ్చులా వ్యాపిస్తోంది. విషయం సింపుల్ - ఓ ఆభరణం! కానీ అది ధరించిన వ్యక్తులు, సందర్భాలు మాత్రం చాలా హై ప్రొఫైల్. 2007లో ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకునేటప్పుడు అభిషేక్ బచ్చన్ తలపాగాకు పెట్టుకున్న నగ, ఈ మధ్య మెట్ గాలాలో ఈశా అంబానీ బ్లౌజ్ వెనుక అలంకరించిన పచ్చల ఆభరణం.. రెండూ అచ్చం ఒకేలా ఉన్నాయి!
26
నగలను కనిపెట్టే పనిలో నెటిజన్లు
ఇది చూసిన నెటిజన్లు, ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల వెంటపడే Gen Z కుర్రాళ్లు ఊరుకుంటారా? 'రెడ్డిట్' లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద డిటెక్టివ్ పనే మొదలుపెట్టారు. ఈ రెండు నగల ఫోటోలను పక్కపక్కన పెట్టి చూస్తూ, అభిమానులు పదుల కొద్దీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
36
బచ్చన్ ఫ్యామిలీ అమ్మేసిందా?
"బచ్చన్ కుటుంబం తమ ఈ వారసత్వ ఆభరణాన్ని అంబానీ కుటుంబానికి అమ్మేసి ఉండాలి" అనేది కొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అభిషేక్ బచ్చన్ ధరించిన నగలు.. ఇప్పుడు ఈశా అంబానీ ధరించిన నగలు ఒకేలా ఉండటంతో కొంటె ప్రశ్నలతో నెట్టింట రచ్చ చేస్తున్నారు కుర్రాళ్లు.
మరికొంతమంది ఫ్యాషన్ ప్రియులు ఇంకాస్త లోతుగా పరిశీలిస్తున్నారు. "అభిషేక్ ధరించిన నగల పచ్చల రంగుకు, ఈశా ధరించిన ఆభరణం మెరుపుకు తేడా ఉంది. ఈశా ధరించింది హై క్వాలిటీ ఒరిజినల్ పీస్, అభిషేక్ ధరించింది కేవలం డిజైనర్ రీ-క్రియేషన్ కావచ్చు` అని వాదిస్తున్నారు. `ఇదంతా శ్రీమంతుల ఆట! వారసత్వ నగలను ఒకసారి పెళ్లిలో తల మీద పెట్టుకుంటారు, మరోసారి బ్లౌజ్‌కు స్టైల్‌గా తగిలించుకుంటారు" అని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
56
వారసత్వమా? డిజైనర్ మాయా?
బచ్చన్ కుటుంబం ఆభరణాలు వారసత్వంగా వచ్చినవని నమ్ముతారు. కానీ మెట్ గాలాలో ఈశా అంబానీ ధరించిన ఆభరణాన్ని 'జేడ్ బై మోనికా అండ్ కరిష్మా' డిజైన్ చేశారు. ఇది అంబానీ కుటుంబ వారసత్వ నగలను లేటెస్ట్ మోడల్‌కి మార్చడమా, యాదృచ్ఛికమా అనేది ఇంకా రహస్యమే. మొత్తానికి, ఈ 'పచ్చ'ల ఆభరణం రహస్యం బాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీసింది.
66
నిజాం నవాబ్ ధరించిన నగలు
ఇదిలా ఉంటే ఈ నగలను నిజాం నవాబ్ ధరించారు. ఈశా అంబానీ ధరించిన డైమాండ్ అభరణం.. అచ్చం నిజాం నవాబ్ ధరించిన కిరీటం మాదిరిగానే ఉంది. అది రాజు తన స్థాయిని తెలియజేసేలా ఈ నగలను తలపై ధరిస్తారు. ఇప్పుడు దాన్ని ఈశా ఇలా తనదైన స్టయిల్‌లో ధరించడం విశేషం. ఇక ఈశా అంబానీ ధరించిన ఈ నగల కాస్ట్ తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. దీని విలువ ఏకంగా రూ.200కోట్లు ఉంటుందని సమాచారం.