ఇక ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ పై భారీ చర్చ నడిచింది. ఒకదశలో ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ కోరినట్లు కొరటాల శివ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఇటీవల కొరటాల శివ కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తో భేటీ అయిన ఫోటోలు చక్కర్లు కొట్టాయి.