Intinti Gruhalakshmi: చీప్ క్యారెక్టర్ మామ్ అని తులసిని అవమానించిన అభి.. ఆతర్వాత ఏం జరిగిందంటే?

Published : Nov 12, 2022, 11:21 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
19
Intinti Gruhalakshmi: చీప్ క్యారెక్టర్ మామ్ అని తులసిని అవమానించిన అభి.. ఆతర్వాత ఏం జరిగిందంటే?

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. అభి తులసి ఇంటికి వస్తాడు.. ఇక్కడికి ఇంకెవరు రారు అని రావడం రావడంతోనే డైలాగ్ వేస్తాడు. శుభకార్యానికైనా ఆశుభకార్యానికి అయినా సరే ఎవరు ఇక్కడికి రారు.. అర్థమవుతుందా మామ్ నీకు.. రేయ్ అభి ఏం మాట్లాడుతున్నావ్ రా ఈ రోజు తాతయ్య పుట్టినరోజు.. కొద్దిగా ముందు వచ్చుంటే నువ్వు కూడా మాతో పాటే ఎంజాయ్ చేసేవాడివి.. వస్తావ్ అనే అనుకున్నాను అని తులసి అంటుంది.. చూడు మామ్.. నేను ఇక్కడికి వచ్చింది నీతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి లేకపోతే నువ్వు ఇక్కడ కొత్త ఇంట్లోకి వచ్చావ్ అని కంగ్రాట్స్ చేయడానికి రాలేదు అని అభి అంటాడు.. నువ్వు చేస్తున్న సిగ్గుమాలిన పనులకు మేము సఫర్ అవ్వడానికి రాలేదు చెప్పేది వినబడుతుందా అని అభి అంటే హ వినిపిస్తుంది..
 

29

చూడు తాతయ్య పుట్టినరోజు సంతోషాన్ని పాడుచేసుకోకూడదని ఆలోచించాను కానీ నువ్వు అది ఉండనీచ్చేలా లేవు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అభి ఇక్కడ ఉండకు అని చెప్పిన వినకుండా.. అసలు ఏంటి నీ పేద్ధరికం నీ వివాహ బంధాన్ని నిలుపుకోవడం నీకు చేత కాలేదు కానీ నీ పిల్లలకు నీతులు చెప్తూ వాళ్ళ జీవితాలతో కూడా ఆదుకోవాలి అనుకుంటున్నావా? అసలు నువ్వు తల్లివైనా నీ జీవితం లానే నీ కొడుకు జీవితానికి నాశనం చేయాలనుకుంటున్నావా అని అభి అంటాడు. మా మొగుడు పెళ్ళాల్ని కూడా ఎలా విడదీయాలనిపిస్తుంది నీకు అంటూ ప్రశ్నిస్తాడు. నవమాసాలు మోసి కనిపెంచిన దాన్ని రా నేను.. నా కొడుకు జీవితాన్ని ఎందుకు నిన్ను నాశనం చేయాలనుకుంటాను అని తులసి అంటుంది.
 

39

నాశనం చేయడం కాదు నాశనం చేసేసావు అని అంటాడు. నా భార్యకు నన్ను శత్రువులు చేసేసావు చూసావు కదా చూసావు కదా ఎలా బిహేవ్ చేస్తుందో అని అరుస్తూ ఉంటాడు. నాకు సపోర్ట్ గా నిలబడిన మా అత్తగారికి కూడా నువ్వు నన్ను దూరం చేసేసావు.. ఎవరికి కాకుండా ఎందుకు పనికి రాకుండా చేశావు అని అంటాడు. అప్పుడు అంకిత మాట్లాడుతూ నీ చేతగానితనానికి నీ మూర్ఖత్వానికి ఎందుకు ఆంటీ ని బలి చేస్తున్నావ్ అని అంకిత ప్రశ్నిస్తుంది. ఎందుకా ఎందుకు నా కడుపు మంట.. నా సంసారాన్ని మట్టిలో కలిపి తను బాయ్ ఫ్రెండ్ ని వెతుకుని ఎంజాయ్ చేస్తోంది. ఆ మాటలకు అక్కడే ఉన్న తులసి సామ్రాట్ అంకిత అందరూ షాక్ అయిపోతారు.
 

49

అసలు నీ వయసుకి ఫ్రెండ్షిప్ చేసేది కూడా కాదు అలాంటిది ఏకంగా బాయ్ ఫ్రెండ్ ని వెతుకుని ఎంజాయ్ చేస్తున్నావని తులసిని నిందిస్తాడు అభి. అభి జాగ్రత్తగా మాట్లాడు సామ్రాట్ కారు ఆంటీకి ఫ్రెండ్ మాత్రమే బాయ్ ఫ్రెండ్ కాదు ఒకవేళ అయినా కూడా నీకు నీ ప్రాబ్లం ఏంటి అని అంకిత ప్రశ్నిస్తుంది. నేను బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేసుకోవడం తప్పడం లేదు ఈ వయసులో చేసుకోవడం తప్పనంటున్నానంటే అయితే మీ నాన్న చేసిన పని ఏంటి మీ నాన్న ఏ వయసులో లాస్యకు బాయ్ ఫ్రెండ్ గా ఉన్నాడు.. అప్పుడు నువ్వేం చేశావ్.. అప్పుడు నీ బుద్ది ఏమైంది అని ప్రశ్నిస్తుంది. నోరు ముయ్యి అంకిత.. నువ్వు ఎన్ని మాట్లాడిన మా మామ్ మనందరికీ చెడ్డ పేరు తెచ్చిందనేది మారదు..
 

59

సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి.. పద్ధతులు ఉన్నాయి అవి నేను పుట్టించినవి కాదు.. ఎవ్వరైనా సరే ఆ రూల్స్ కు తలవంచి బ్రతకాల్సిందే..  ఆ రూల్స్ ప్రకారం ఆడది తల్లయిన తర్వాత సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు పోగొట్టుకున్నట్టే అందరూ మదర్స్ రూల్స్ పాటిస్తుంటే మా మదర్ మాత్రం రూల్స్ పట్టించుకోదు.. తల్లులకు స్వార్థం ఉండదు ఉండకూడదు నీకు మాత్రం నిలువెల్లా స్వార్థమే.. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకుంటావ్. ఒక ఆడదానివై ఉండి ఒక తల్లివై ఉండి ఇంత స్వార్థంగా ఇంత దిగజారి ఎందుకు బ్రతుకుతున్నావ్ అంటూ అభి ప్రశ్నిస్తాడు.
 

69

మనవళ్లు మనవరాలతో ఆడుకోవాల్సిన వయసులో మా మామ్ అని అనగానే సామ్రాట్ సీరియస్ గా కోపంగా గట్టిగా అభి అంటూ అరుస్తాడు. చాలు ఇంకా మాట్లాడకు.. శ్రీరాముడీలా ప్రశాంతంగా ఉండే ఈ సామ్రాట్ లో పరశురాముడు కూడా ఉన్నాడు. వరకు నీ మాటలు విన్నాను ఇకపై ఒక్క మాట వచ్చినా పరశురాముడులా నీ గొడ్డలి తీస్తా అంటూ సామ్రాట్ కోపంతో అరుస్తాడు. జాగ్రత్తగా చెవులు రెక్కించుకొని విను మీ అమ్మని ఏ ఒక్క మాటతో అవమానించిన ఇంక నేను ఊరుకోను.. అలాగే నా ఫ్రెండ్ నీ అవమానించిన ఊరుకోను.. అర్థమైందా అంటూ అరుస్తాడు సామ్రాట్. మీరు ఊరుకోండి సామ్రాట్ గారు అని తులసి అంటే ఆ మాటలకూ అభి ఇంకా సీన్ చేస్తాడు..
 

79

మా మామ్ ఆపితే మీరు ఆగిపోతారని నాకు ఇప్పుడే తెలిసింది.. ఈ ఏజ్ లో ప్రేమ కూడా ఇంత పవర్.. ఇంత వాల్యూ.. వావ్ అని అభి వెటకారం చేస్తాడు. ఇకనుంచి వెళ్ళిపో నా చేయి కంట్రోల్ తప్పకుండా నుంచి వెళ్ళిపో అని సామ్రాట్ అంటే మీరెవరు మీరెవరు నుండి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమని చెప్పడానికి.. అభి ఇంకా చాలు సామ్రాట్ గారితో మర్యాదగా మాట్లాడు అని అంటే మర్యాద గాడిద గుడ్డ అని మళ్లీ అభి రెచ్చిపోతాడు. ఎవరి వల్ల అయితే మన ఫ్యామిలీ ముక్కలవుతుందో ఆ మనిషికి నేనెందుకు గౌరవ ఇవ్వాలి అంటాడు. మీ వల్లే మా కుటుంబం ముక్కలైంది అని సామ్రాట్ ను తిడుతాడు..మా మామ్ ది ఇంత చీప్ క్యారెక్టర్ అని అనుకోలేదుంటూ తులసిని అంటాడు. అంతే తులసి రుద్రకాళిగా మారిపోతుంది.. ఒక్క దెబ్బ కొట్టగానే అవి కింద పెడతాడు..
 

89

ఏమన్నావ్ రా ఏమన్నావ్ రా నువ్వు? నేను క్యారెక్టర్ లేస్సా ఎంత ఈజీగా అన్నావ్.. లోకంలో అంత దిగజారచ్చు కానీ ఏ అమ్మ చెడ్డది కాదు రా అని అంటుంది. మీ అమ్మ ఏంటో ఎలాంటిదో నీకు తెలీదు రా తలకిందులు తపస్సు చేసినా నీకు ఎప్పటికీ తెలియదు.. నేనేంటో నాకు తెలుసు, నేను నమ్మిన నా దేవుడికి తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. నీలాంటి కొడుకును కన్నందుకు సిగ్గుపడుతున్నాను.. నీలాంటి విషపురుగుని ఈ లోకంలోకి తీసుకువచ్చినందుకు సిగ్గుపడుతున్నాను.. నువ్వు నా కొడుకు కాదురా నువ్వు మీ నాన్న కొడుకువి ఈ అమ్మ బిడ్డవి కాదు.. ఈరోజు నుంచి ఇప్పటి నుంచి నువ్వు నాకు ఏమి కావు వినబడుతుందా అని తులసి చెప్తుంది. 

99

నువ్వు కాకుండా వేరే ఎవరైనా ఇలా మాట్లాడి ఉంటే ఏం చేస్తుందో తెలుసా వాళ్ళని చంపేసే దాన్ని అని అంటుంది తులసి. చేయాల్సిన తమాషా అంత పూర్తయిందా ఇంకా ఏదైనా మాట్లాడి దిగజారి పోవాలని ఉందా? అయిపోతే ఇక బయలుదేరు.. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో.. అర్థం కావడం లేదా నడువు రా నడురా అంటూ అభి కాలర్ పట్టుకుని ఇంటి నుంచి గెంటేస్తుంది తలచి.. అలా గెంటీయగానే అభి కోపంగా చూస్తూ ఉంటే ఏంట్రా ఆ చూపు.. వేళ్ళు ఇక్కడ నుంచి అంటే మళ్లీ అభి సామ్రాట్ ని నిందిస్తాడు.. నీ వల్లే ఒక తల్లి ఒక కొడుక్కి దూరం అయ్యిందని అంటాడు.. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

click me!

Recommended Stories