అంతటితో ఆగడం లేదు, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, చిరంజీవి లెజెండ్స్ అయితే, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, అల్లు రామలింగయ్యలకు రెస్పెక్ట్ ఇవ్వరా? కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబులకంటే చిరంజీవి తోపా? అంటూ ఆడుకుంటున్నారు. బండ్ల గణేష్‌ని ట్రోల్స్ తో రచ్చ చేస్తూ, సరికొత్త వివాదానికి తెరలేపుతున్నారు. మరికొందరు మెగా హీరోలందరిని మిస్ అయ్యావంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తంగా బండ్ల గణేష్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలయ్య, అక్కినేని వివాదం కాస్త చిరు రంగు పులుముకుని మరో రూపం దాల్చుకుంటుంది. మరి దీనిపై బండ్ల గణేష్ స్పందించి వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా? మరింత పెద్దది చేస్తాడా? అనేది చూడాలి.