Konda movie
బయోపిక్ లు తీయటంలో వర్మది అందెవేసిన చెయ్యి. ఆయన తమ బయోపిక్ తీస్తే బాగుంటుందని చాలా ఉత్సాహపడుతూంటారు. అయితే వివాదాస్పద అంశాలు కల వాటినే ఎంచుకుని,తనదైన మార్క్ సీన్స్ ని కలిపి వండి వడ్డిస్తూంటారు. ఆ క్రమంలో గతంలో రక్త చరిత్ర మొదలుకొని నిన్న మొన్నటి డి కంపెనీ దాకా సాగాయి. వీటిలో కొన్ని సక్సెస్ లు మరిన్నో ఫెయిల్యూర్స్. అయినా ఆయన తీస్తూనే ఉన్నారు. తాజాగా కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా 'కొండా' అనే చిత్రం తీసారు. అయితే ఆయన గత చిత్రాల ఫలితాలతో ఈ సినిమాపైనా పెద్దగా హోప్స్ లేవనే చెప్పాలి. అయితే ఒక్కోసారి అంచనాలు తారుమారు కావచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా..ఈ సినిమా ఎలా ఉంది..వర్కవుట్ అవుతుందా లేక వర్మ గత చిత్రాలో చేరుతుందా చూద్దాం...
Konda movie
కథ
1990 లో వరంగల్ నేపధ్యంలో జరిగే ఈ కథలో ...ఇద్దరు విద్యార్ది నాయకులు...రాడికల్ నేపధ్యం వైపు ఎలా ఆకర్షితులు అయ్యారు..రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ ఇది. కొండ మురళి (త్రిగుణ్) ఓ స్ట్రాంగ్ పర్శన్ గా మనకు కనిపిస్తారు. ఆయన ఆవేశపరుడు. ఎవరికి అన్యాయం జరిగినా చూస్తే ఆగలేరు. కాలేజీ రోజుల్లో రాజ్యాంగం చదివి ఉత్తేజితుడు అవుతాడు. మురళి విప్లవాత్మక ఐడియాలజీని చూసిన ఆర్కే (ప్రశాంత్ కార్తి) అతన్ని ఎంకరేజ్ చేసి తమ నక్సల్స్ లో కలుపుకుంటాడు.
konda
అలాగే కొంతకాలం తర్వాత అతని ధైర్యం చూసి నల్ల సుధాకర్ (పృధ్వీ) సైతం తమ పార్టీలో జాయిన్ అవ్వమని ఆహ్వానిస్తాడు. అయితే సుధాకర్ తనను తన అవసరాలకు వాడుకుంటున్నాడనే విషయం గమనించడు. అయితే అతన్ని చంపటానికే ప్లాన్ చేయటంతో ప్రక్కకు వచ్చేస్తాడు. అయితే ఆ ఉచ్చు నుంచి కొండా తప్పించుకోగలిగాడా... ఆ తర్వాత తన పొలిటికల్ కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకున్నాడు.. కొండా సురేఖతో ఎలా పరిచయం ఏర్పడుతుంది. వారి వివాహంకి ఎలా జరిగింది. సమాజంలోని కొన్ని పరిస్దితులు అతన్ని హింసకు దారి తీసేలా ఎలా ప్రేరేపించాయి. ప్రజల మనిషిగా పోరాట మార్గం ఎంచుకున్న మురళి రాజ్యం నుంచి ఎలాంటి ప్రతిఘటనే ఎదుర్కొన్నాడు..ఈ క్రమంలో ఏం జరిగింది... వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరి కథలో ప్రాధాన్యత ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
konda
ఎలా ఉంది
Mark Twain ఓ చోట ఇలా అంటారు.. “Truth is stranger than fiction, but it is because Fiction is obliged to stick to possibilities; Truth isn’t.”. బయోపిక్ లో ఎంత వాస్తవం ఉన్నది అనేదాన్ని బట్టే... దాని గౌరవం, ప్రశంసలు దక్కుతాయి. అయితే ఒక్కోసారి డ్రామా ఆ నిజాలని కప్పేస్తుంది. అలాంటి ప్రయత్నమే వర్మ తన సినిమాల్లో చేస్తూంటారు. అందుకే ఇలాంటి బయోపిక్ కథల్లో పెద్దగా విశ్లేషించటానికి ఉండదు. ఎందుకంటే ఓ గొప్ప బయోగ్రఫీకు హిస్టారికల్ ఏక్యురసీ అవసరం. అలాగే unbiased biopic చెప్పగలగాలి. పూర్తి ఆబ్జెక్టివ్ గా విషయాన్ని చెప్పగలగటం అనేది చాలా కష్టమైన పనే. అది వర్మ కు స్పష్టంగా తెలుసు. కాబట్టి అందరికీ తెలుసున్న కొన్ని సంఘటలనే గ్లోరిఫై చేస్తూ సినిమాని రక్తి కట్టించటానికి ఆయన ప్రయత్నం చేసారు. అయితే అవేమీ తెరపై వర్కవుట్ కాలేదు. చాలా సార్లు తేలిపోయాయి. కాకపోతే వర్మ తనదైన లాజిక్ సీన్స్ తో, కన్విక్షన్ తో కొన్ని సార్లు ఒప్పిస్తాడు. పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరుడుతున్న పరిస్దితులను మాత్రం సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అలాగే విపరీత పరిస్థితుల నుంచి విపరీత వ్యక్తులు ఉద్భతివస్తారని నోటితో చెప్తారు కానీ తెరపై అంతలా కనపడదు. రక్తపాతం, హింసతో పాటు కొండా మురళి, సురేఖ మధ్య ప్రేమకథ మాత్రం బాగా చూపించారు. అంతకు మించి చెప్పుకోవటానికి ఏమీ లేదు.
konda
బాగున్నవి
నటీనటుల ఫెరఫార్మెన్స్ లు
వాస్తవిక పద్దతిలో నడిచే నేరేషన్
బాగోలేనివి
ఎక్కడా కొత్తదనం అనిపించకపోవటం
డాక్యుమెంటిరీలా చాలా సార్లు అనిపించటం
konda
టెక్నికల్ గా ...
ఇలాంటి బయోపిక్ డ్రామాలు తీయటంలో రామ్ గోపాల్ వర్మ పండిపోయారు. అయితే ఎప్పటిలాగే తన టెంప్లేట్ లోనే ఈ సినిమాని తీసారు. 90లనాటి రియలిస్టిక్ వాతావరణం క్రియేట్ చేసారు. మ్యూజిక్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్..ఆ ప్రొసీడింగ్స్ కు తగ్గట్లుగానే ఉంది. మనీష్ ఠాకూర్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. రన్ టైమ్ ని తగ్గించి మేలు చేసారు. సినిమాటోగ్రఫీ కూడా నేరేషన్ కు తగినట్లు సహజంగా సాగింది. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి.
konda
నటీనటుల్లో త్రిగుణ్ ఫెరఫెక్ట్ ఛాయిస్. మానరిజంలు, డైలాగు డెలవరీ సినిమాకు ఓ కొత్త లుక్ తెచ్చిపెట్టాయి. నటనలో ఇంటెన్స్ తీసుకొచ్చారు.అలాగే సెకండాఫ్ లో అతని నటనలో డెప్త్ కనిపిస్తుంది. సురేఖ పాత్రలో నటించిన ఇర్రా మోర్ తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది. కమిడయన్ పృథ్వీరాజ్ నెగిటివ్ రోల్ లో రాణించారు. డీసెంట్ గా చేసుకుంటూ పోయారు. ఎల్బీ శ్రీరామ్, తులసి వంటి సపోర్టింగ్ ఆర్టిస్ట్ లు ఆ పాత్రలకు ఫెరఫెక్ట్ యాప్ట్.
konda
ఆఖరి మాట
రక్త చరిత్ర స్దాయిలో సినిమాని ఎక్సపెక్ట్ చేస్తే కొండా..మన మీద బండలా అనిపిస్తుంది.
Rating: 2
నటీనటులు:అదిత్ అరుణ్, ఇర్రా మోర్, పృథ్వీరాజ్, తులసి, ఎల్బీ శ్రీరామ్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, అభిలాష్ చౌదరి, శ్రవణ్ తదితరులు
ఎడిటర్: మనీష్ ఠాకూర్,
ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోషి,
సంగీతం: డి.ఎస్.ఆర్,
కో-డైరెక్టర్: అగస్త్య మంజు,
నిర్మాణం: కంపెనీ ప్రొడక్షన్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జక్కుల వెంకటేశ్,
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.