రామ్‌చరణ్ 'పెద్ది' మూవీలో జాన్వీకపూర్‌కు డూప్‌గా తెలుగు హీరోయిన్.. అందాన్ని చూస్తే మైమరిచిపోతారు

Published : Nov 26, 2025, 06:18 PM IST

Janhvi Kapoor: రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక్కడ ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.? 

PREV
15
'ఉప్పెన' డైరెక్టర్‌తో చెర్రీ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, మీర్జాపూర్ ఫేం దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రం మార్చి 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

25
'అచ్చియ‌మ్మ'గా జాన్వీ..

ఈ పెద్ది చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్.. 'అచ్చియ‌మ్మ' అనే పాత్రలో మెరవనుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అలాగే ఇటీవల జాన్వీ కపూర్ సెంట్రిక్‌గా విడుదలైన 'పెద్ది' మూవీ సాంగ్ యూట్యుబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

35
జాన్వీకి డూప్..

ఈ మూవీలో జాన్వీ కపూర్‌కు కొన్ని సీన్స్‌లో డూప్‌గా తెలుగు అమ్మాయి నటించిందట. ఇక ఆమె మరెవరో కాదు.. బాంధవి శ్రీధర్. 'మసూద' మూవీలో దెయ్యంగా భయపెట్టిన బాంధవిని.. 'పెద్ది' మూవీలో జాన్వీకి డూప్‌గా నటిస్తోందట. జాన్వీ కపూర్ హైట్ 5 అడుగుల 4 అంగుళాలు. బాంధవి కూడా సేమ్ హైట్ ఉండటం.. అలాగే ఇద్దరి లుక్స్ కూడా కామన్‌గా ఉన్నందున బాంధవిని డూప్‌గా తీసుకుంటున్నారట. అలాగే జాన్వీ కపూర్ ఫ్లైట్ ఖర్చులు, హోటల్ రూమ్ ఖర్చులు లాంటివి ఆదా చేసేందుకు నిర్మాతలు బాంధవిని తీసుకున్నట్టు టాక్.

45
బాంధవికి మంచి ఫాలోయింగ్..

హీరోయిన్ బాంధవి శ్రీధర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తరచూ ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతోంది. ఇటీవల పెద్ది సినిమాలోని చికిరి చికిరి సాంగ్‌కు హుషారుగా స్టెప్పులేసింది బాంధవి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

55
చికిరి చికిరి సాంగ్ వైరల్..

ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్‌ను తెగ షేక్ చేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటిన ఈ సాంగ్.. అటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది రీల్స్ చేసిన పాటగా రికార్డుల్లోకి ఎక్కింది. ముఖ్యంగా రామ్ చరణ్ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. అటు జాన్వీ అందం కూడా పాటకు హైలైట్‌గా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories