మహేష్ బాబు సినిమా అనగానే ఎగిరి గంతేశా, ఆ మూవీనే నా కెరీర్ ని ముంచేసింది..స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Published : Nov 26, 2025, 06:07 PM IST

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే ఒక్క సినిమా పరాజయం మాత్రం తన కెరీర్ ని బాగా ఎఫెక్ట్ చేసింది అని రకుల్ అంటోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
మహేష్ బాబు భారీ బడ్జెట్ చిత్రాలు 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే చిత్రంలో నటిస్తున్నారు. గతంలో మహేష్ బాబు పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించారు. వాటిలో 1 నేనొక్కడినే, స్పైడర్ లాంటి చిత్రాలు ఉన్నాయి. ఇవి మహేష్ కెరీర్ లో భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా స్పైడర్ మూవీ నిర్మాతలకు తీవ్ర నష్టాలని మిగిల్చింది. 

25
రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్ 

ఈ చిత్రం గురించి రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రకుల్ ప్రీత్ నటించిన లేటెస్ట్ మూవీ దే దే ప్యార్ దే 2. ఇటీవల ఈ చిత్రం విడుదలయింది. దీనితో రకుల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ తన కెరీర్ ని ప్రభావితం చేసిన అతిపెద్ద ఫ్లాప్ గురించి రకుల్ వివరించింది. 

35
మహేష్ సినిమా అనగానే ఎగిరి గంతేశా 

నా కెరీర్ ని ఎఫెక్ట్ చేసిన బిగ్ ఫెయిల్యూర్ అంటే స్పైడర్ మూవీ అనే చెప్పాలి. మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో నాకు ఛాన్స్ రాగానే ఎగిరి గంతేశా. కానీ హిట్, ఫ్లాప్ అనేది నా చేతుల్లో లేదు. ఆ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు నా కెరీర్ పీక్ లో ఉంది. రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో నటిస్తున్నా. మరికొన్ని చిత్రాలకు సైన్ చేశా. దాదాపు 10 చిత్రాలు ఆ టైంలో నా చేతిలో ఉన్నాయి. 

45
ఆ సినిమా నుంచి నా కెరీర్ డౌన్ ఫాల్ 

కానీ స్పైడర్ ఫ్లాప్ కావడం నా కెరీర్ ని ఎఫెక్ట్ చేసింది. ఆ తర్వాత నా కెరీర్ డౌన్ ఫాల్ అయింది అని రకుల్ పేర్కొంది. ఆ మూవీ పరాజయంతో నేను కుంగిపోలేదు. ఒక లెసన్ గా భావించా అని రకుల్ పేర్కొంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. సైకో విలన్ చేసే అరాచకాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ బాబు, ఎస్ జె సూర్య ఈ మూవీలో పోటీ పడి నటించారు. 

55
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు 

రకుల్ ప్రీత్ సింగ్ చాలా కాలం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో రకుల్ కి తెలుగులో ఫస్ట్ బ్రేక్ లభించింది. ఆ తర్వాత ఆమె లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు,ధృవ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. 

Read more Photos on
click me!

Recommended Stories