అభిషేక్-ఐశ్వర్య విడాకుల రూమర్స్: పాత వీడియో తవ్వి తీసి మరీ వైరల్ చేస్తున్న నటి

First Published | Nov 5, 2024, 11:47 AM IST

అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ ల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐశ్వర్య మరో డాక్టర్‌ను పెళ్లి చేసుకోనున్నారని, అభిషేక్ మరో హీరోయిన్‌తో సన్నిహితంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇరువురి నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Simi Garewal, Abhishek Bachchan, divorce rumors, Aishwarya Rai

బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ఎక్కడా ఈ విషయమై బహిరంగంగా కామెంట్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి.

అసలు ఇందులో ఎంతవరకూ నిజం ఉంది, ఇద్దరిలో ఎవరి తప్పు ఉంది అనే దానిపై ఏ క్లారిటీ లేదు. ఆ రూమర్స్ ప్రకారం ఐశ్వర్య రాయ్ ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకోవడం కోసం అభిషేక్ కు దూరం కావాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ వార్తలు వచ్చి షాక్ ఇచ్చాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.


అదే విధంగా అభిషేక్ విషయంలో కూడా అలాంటి రూమర్స్  స్టార్ట్ అయ్యాయి. గత కొంత కాలంగా ఓ హీరోయిన్ తో అభిషేక్ క్లోజ్ గా ఉంటున్నాడు అనే రూమర్స్ వచ్చి షాక్ ఇచ్చాయి.ఈ క్రమంలో  ఇద్దరూ విడిపోవడం ఖాయం అనే వార్తలకు  ఐశ్వర్య క్లారిటీ ఇచ్చినా ఎక్కడా ఆగటం లేదు.

మరో ప్రక్క  ఐశ్వర్య రాయ్ ఇంటి దగ్గర జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌లో అభిషేక్ కనిపించకపోవడంతో విడిపోయారు అంటూ ప్రచారం పీక్స్ లో జరిగింది. అలాగే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ కలిసి కనపడలేదు. ఈ నేపధ్యంలో అభిషేక్, ఐశ్వర్య మద్య బంధం గురించి అభిషేక్ ఎలాంటివాడో బాలీవుడ్ గళం విప్పుతోంది.
 



ఇక రీసెంట్ గా ఐశ్వర్య తన కూతురు ఆద్యతో కలిసి హాజరవ్వ‌గా.. అభిషేక్ బచ్చన్ మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి రావడంతో విడాకులు అయిపోయి ఉండవచ్చు అంటూ ప్రచారం స్టార్ట్ అయింది. ఐశ్వర్య విదేశాలకు వెళ్ళినా ఏ ఫంక్షన్ కు వెళ్ళినా కూతురితో కలిసే వెళ్తోంది.

దీనితో విడాకులు ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నిమ్ర‌త్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడ్డారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగానే ఐశ్వ‌ర్య‌ను అభిషేక్ దూరం పెడుతున్నాడని టాక్.


ఈ క్రమంలో  అభిషేక్ బచ్చన్ పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ వైరల్ అవుతోంది. ఐశ్వర్యరాయ్‌తో విడాకుల పుకార్లు తీవ్రమవుతున్న టైమ్ లో, యాంకర్ సిమి గరేవాల్ అభిషేక్‌తో తన గత  ఇంటర్వ్యూ యొక్క క్లిప్‌ను షేర్ చేసింది. ఈ క్లిప్‌లో, అభిషేక్ రిలేషన్స్ లో విధేయత మరియు నిబద్ధత గురించి అనర్గళంగా మాట్లాడాడు.  

ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ బాలీవుడ్‌లోని మంచి వ్యక్తులలో అభిషేక్ ఒకరని సిమి షేర్ చేసింది. ఐశ్వర్యరాయ్ పుట్టిన రోజు మరుసటి రోజే సిమి పోస్ట్ చేయడం గమనార్హం.  సిమి గారేవాల్ తన పాపులర్ షో రెండెజౌస్ విత్ సిమి గారేవాల్ నుండి ఒక క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ 2003 ఇంటర్వ్యూలో, అభిషేక్ సంబంధాలలో నిబద్ధత, విధేయతపై తన అభిప్రాయాలను వివరించాడు. జోక్ లేదా గేమ్ కోసం కమిట్‌మెంట్ చూపించవద్దు అని అభిషేక్ క్లియర్ గా చెప్పాడు. 
 

వీడియోను షేర్ చేస్తూ , సిమి ఇలా వ్రాశారు , “అభిషేక్‌ను వ్యక్తిగతంగా తెలిసిన ప్రతి ఒక్కరూ అతను బాలీవుడ్‌లోని మంచి వ్యక్తులలో ఒకడని అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. అతనికి మంచి విలువలు మరియు సహజమైన గౌరవం ఉన్నాయి"  . అలాగే చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ మరియు నటి ఫరా ఖాన్ సిమికి మద్దతుగా అభిషేక్ ని  నిజానికి చుట్టూ ఉన్న మంచి వ్యక్తులలో ఒకడని చెప్పుకొచ్చారు.  ఏది ఏమైనా ఆ వీడియో వైరల్ అవుతోంది. 
 

ఇక అభిషేక్ తన భార్య ఐశ్వ‌ర్య‌కు విడాకులు ఇచ్చి త్వరలోనే నిమ్ర‌త్‌ను పెళ్లి చేసుకోనే ఆలోచనలో ఉన్నట్టు కూడా బాలీవుడ్ లో ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఇటీవల అభిషేక్ న‌టించిన ‘దస్వి’ సినిమాలో హీరోయిన్‌గా ఆమె నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ క్లోజ్ అయ్యారని బాలీవుడ్ లో కోడై కూస్తున్నారు.

ఈ వార్తలకు బలం చేకూర్చుంది నిమ్రత్ కౌర్ సింగిల్ గా ఉండటం. ఆమెకు 42 ఏళ్ళు వచ్చినా సింగిల్ గా ఉంటూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. సల్మాన్ తో అప్పట్లో ప్రేమాయణం నడిపింది కూడా. ఇప్పుడు మళ్ళీ అభిషేక్ తో ప్రేమలో పడిందని టాక్ వస్తోంది. ఏది ఎలా ఉన్నా.. సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్స్ ను అభిషేక్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ సెటైర్ లు వస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ కూడా సల్మాన్ తో ప్రేమ వ్యవహారం నడిపింది.

read more: బలగం వేణు 'ఎల్లమ్మ' హీరో ఫైనల్, ఎవరంటే..?

also read: నాగచైతన్య పెళ్లికి కొత్త వేదిక.. దానికి భయపడే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడా?

Latest Videos

click me!