దీంతో ఇప్పుడిది పవన్ కళ్యాణ్ `ఓజీ`కి పెద్ద ఊరటనిస్తుంది. `ఓజీ` విడుదలకు లైన్ క్లీయర్ అయినట్టయ్యింది. పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` మూవీని కూడా సెప్టెంబర్ 25నే విడుదల చేస్తున్నారు. మొదట `అఖండ 2`, `ఓజీ`లు ఇదే తేదీన విడుదల తేదీ ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని భావించారు. దసరా పండుగ ఉండటంతో పోటీ ఉన్నా, రెండు సినిమాలు ఆడుతాయని, కాకపోతే కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఎదురవుతుందని భావించారు. కానీ `అఖండ 2` వాయిదా పడటంతో ఇప్పుడు `ఓజీ`కి లైన్ క్లీయర్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక పవన్ హీరోగా రూపొందుతున్న `ఓజీ` చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.