'మిరాయ్' ట్రైలర్ రివ్యూ.. తేజ సజ్జాకి మరో 300 కోట్ల చిత్రం అవుతుందా, పీపుల్ మీడియా జాతకం మారుతుందా ?

Published : Aug 28, 2025, 05:10 PM IST

తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. గూస్ బంప్స్ తెప్పించే కొన్ని మూమెంట్స్ కూడా ఉన్నాయి. 

PREV
15

యువ హీరో తేజ సజ్జా క్రమంగా టాలీవుడ్ లో తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు. అద్భుతమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. తేజ సజ్జాకి సూపర్ హీరో అనే ఇమేజ్ క్రమంగా బిల్డ్ అవుతోంది. ప్రస్తుతం తేజ సజ్జా నటిస్తున్న చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 

25

ఈ చిత్రంలో మంచు మనోజ్ తొలిసారి విలన్ గా నటిస్తున్నారు. మంచు మనోజ్ సూపర్ విలన్ కాగా అతడిని ఎదుర్కొనే సూపర్ హీరో పాత్రలో తేజ సజ్జా నటిస్తున్నాడు. అసలు మిరాయ్ చిత్రం దేని గురించి, కథాంశం ఏంటి, ఈ మూవీ ఎలా ఉండబోతోంది అనే అంచనాలు ఆడియన్స్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 12న ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. దీనితో తాజాగా చిత్ర యూనిట్ మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. 

35

మిరాయ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. సూపర్ హీరో కథల్లో కొన్ని అంశాలు కామన్ గా ఉంటాయి. సామాన్య మానవులకు సాధ్యం కానీ కష్టతరమైన పనిని పూర్తి చేసే సామర్థ్యం హీరోకి ఉంటుంది. హీరోకి అతీత శక్తులు లభించడం, వాటిని లోక కళ్యాణం కోసం ఉపయోగించడం అనేది సూపర్ హీరో చిత్రాల్లో కామన్ గా ఉండే అంశం. ట్రైలర్ లో చూపిన దాని ప్రకారం మిరాయ్ చిత్రం కూడా ఆ విధంగానే ఉండబోతోంది. 

45

అబ్బుర పరిచే విజువల్స్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఒక ప్రమాదం పొంచి ఉందని దానిని అడ్డుకోవడానికి నువ్వు మిరాయ్ ని చేరుకోవాలని హీరోయిన్ హీరోకి చెబుతుంది. అప్పటి వరకు సాధారణ కుర్రాడిగా ఉన్న తేజ సజ్జా.. హీరోయిన్ మాటలని పట్టించుకోడు. నువ్వు అనుకుంటున్న మనిషి, అడ్రెస్ నేను కాదని చెబుతాడు. చివరికి ఎలాగోలా హీరోయిన్ రితిక నాయక్. తేజ సజ్జాని ఒప్పిస్తుంది. అప్పుడు తేజ సజ్జా తన మిషన్ ప్రారంభిస్తాడు. 

55

విలన్ గా ఉన్న మనోజ్ కి 9 గ్రంధాలు దొరికితే లోక వినాశనం జరుగుతుంది అని జగపతి బాబు కూడా హెచ్చరిస్తారు. దీనితో మిరాయ్ ని సాధించేందుకు హీరో బయలుదేరుతాడు. మిరాయ్ త్రేతా యుగానికి చెందిన ఒక పవర్ ఫుల్ ఆయుధం అని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ట్రైలర్ లో యాక్షన్ స్టంట్స్, విజువల్స్ అదిరిపోయాయి. ట్రైన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ చాలా బావుంది. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించారు. ట్రైలర్ చివరి నిమిషంలో వచ్చే సాంగ్, బిజియం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సినిమా కూడా ఇదే విధంగా ఉంటే హీరో తేజ సజ్జాకి మరో 300 కోట్ల బ్లాక్ బస్టర్ పడినట్లే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి హిట్స్ కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. మరి మిరాయ్ చిత్రం ఈ సంస్థ జాతకం మారుస్తుందో లేదో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories