ఇందులో ఓ సాంగ్‌లో బాలయ్యతో కలిసి నటించిన లయ. పాట చిత్రీకరణ జరుగుతుంది. డాన్స్ మూమెంట్ అయిపోయింది. తన వెనకాల బాలకృష్ణ ఉన్నారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఆమెకి అర్థం కాలేదు, స్టెప్ అయిపోయిన తర్వాత వెనక్కి కాలువేసిందట. కానీ వెనకాలే బాలయ్య ఉన్నాడు, ఆయన కాలుని తొక్కేసింది. కాస్త గట్టిగానే తొక్కిందట.
అంతే వెంటనే బాలయ్య గట్టిగా అరిచి గోల చేశాడట. నా కాలు తొక్కేస్తావా అంటూ ప్యాకప్ అని అన్నాడట. అయ్యో తన వల్ల ప్యాకప్ చెబుతున్నారని చెప్పి, బాలయ్య సీరియస్ అయ్యాడని చెప్పి ఆమె సారీ సార్ సారీ సార్ అంటూ బతిమాలుకుందట. అందరి ముందు సెట్‌లోనే కన్నీళ్లు పెట్టుకుందట.