Balakrishna
బాలకృష్ణ హోస్ట్ గా చేసిన `అన్ స్టాపబుల్` టాక్ షోలో ఇండియా వైడ్‌గా సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన మరో రియాలిటీ షో చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 9 వ సీజన్‌కి ఆయనే హోస్ట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున స్థానంలో బాలకృష్ణని తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం నడుస్తుంది.
Nandamuri Balakrishna
నాగార్జున హోస్ట్ గా చేసిన `బిగ్ బాస్ తెలుగు` షోకి అంతగా ఆదరణ దక్కడం లేదని, రేటింగ్ పడిపోతుందని, అందుకే బాలయ్యని తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చింది. బాలయ్య టీమ్ దీనిపై స్పందించింది. బిగ్ బాస్ తెలుగు 9 హోస్ట్ గా బాలయ్య చేస్తారనే రూమర్లపై వాళ్లు స్పందించారు. అందులో నిజం లేదని తెలిపారు.
balakrishna, bigg boss telugu 9, nagarjuna
నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి హోస్ట్ చేస్తున్నారని వస్తున్న వార్తలు ఫేక్ అని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది టీమ్. అయితే గతంలోనే ఏషియానెట్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బాలయ్య హోస్ట్‌గా రావడం జరగదు అని తెలిపింది. నాగార్జుననే ఈ సీజన్‌కి కొనసాగిస్తారని, ఇదే కాదు, నెక్ట్స్ సీజన్‌కి కూడా ఆయనే హోస్ట్ అనే విషయం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 9కి హోస్ట్ గా విజయ్ దేవరకొండ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అందులోనూ నిజం లేదని విజయ్ టీమ్ వెల్లడించింది. అయితే రానా బాగా సెట్ అవుతారని, ఆయన హోస్టింగ్ బాగుంటుందని ఇటీవల మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా వెల్లడించడం గమనార్హం. నాగార్జున ఉంటే తాను వెళ్లను అని కూడా చెప్పింది.
bigg boss telugu 9, nagarjuna
ఇక బిగ్ బాస్ తెలుగు 9 షోకి నాగార్జుననే హోస్టింగ్ చేస్తారని తెలుస్తుంది. ఈ విషయంలో ఎలాంటి మార్పులు లేవని సమాచారం. ఈ సీజన్ ఆగస్ట్ లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్ జరుగుతుందని సమాచారం. అయితే ఈ సారి కాస్త నోటెడ్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్.