బాలయ్య హోస్ట్-చిరంజీవి గెస్ట్.. ఆ ప్రశ్నలు అడిగే ధైర్యం ఉందా?

First Published | Aug 10, 2024, 7:50 PM IST

అన్ స్టాపబుల్ షో త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. గెస్ట్ గా చిరంజీవి వస్తారట. ఒకవేళ చిరంజీవి వస్తే, నాగబాబు తన మీద చేసిన ఆరోపణల పై స్పష్టత అడిగే ధైర్యం బాలయ్య చేస్తాడా.. 
 

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే షో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ షో వేదికగా బాలయ్యలోని మరో టాలెంట్ వెలుగులోకి వచ్చింది. బాలయ్య హోస్టింగ్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు. ఆయన సెలెబ్రెటీలతో ఇంటరాక్ట్ అయిన విధానం .. వాళ్లతో తమ సీక్రెట్స్ చెప్పిస్తూ ఫన్ జెనరేట్ చేసిన తీరు ఆకట్టుకున్నాయి. ఈ షో ద్వారా బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది.  ఇప్పటివరకు మూడు సీజన్స్ ప్రసారం కాగా భారీ వ్యూస్ రాబట్టింది. 

సీజన్ 3 మాత్రం లిమిటెడ్ ఎడిషన్ తో ముగించారు. దీంతో సీజన్ 4 పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ దసరా పండుగ కానుకగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 12వ తేదీన స్ట్రీమ్ కానుందట. ఇక ఈ అన్ స్టాపబుల్ సీజన్ 4 కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఆహా ఎనౌన్స్ చేయనుందట. 
 


PawanKalyan On Unstoppable

గత సీజన్లతో పోలిస్తే ఈసారి అంతకుమించి ఎంటర్టైన్మెంట్ ఉండేలా సీజన్ 4 ని ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి బడా హీరోలు ఈ నాలుగో సీజన్ గెస్టులుగా రాబోతున్నారు అని సమాచారం. గత సీజన్లో కేవలం రెండు ఎపిసోడ్లు మాత్రమే స్ట్రీమింగ్ అయ్యాయి. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. 
 

Balakrishna Unstoppable show

ఒకవేళ చిరంజీవి గెస్ట్ గా వస్తే నాగబాబు లేవనెత్తిన కాంట్రవర్సీ పై బాలయ్య ప్రశ్నలు అడగగలడా? అనే వాదన తెరపైకి వచ్చింది. అన్ స్టాపబుల్ షోలో పాల్గొనే గెస్ట్స్ జీవితాల్లో ఉన్న వివాదాలను, పుకార్లను బాలయ్య తెరపైకి తెస్తాడు. సీనియర్ ఎన్టీఆర్-కృష్ణ మధ్య నెలకొన్న వివాదం పై మాట్లాడాలని మహేష్ బాబును బాలకృష్ణ అడిగాడు. రవితేజ, నారా చంద్రబాబు నాయుడుని కూడా బాలకృష్ణ కొన్ని క్రేజీ ప్రశ్నలు అడిగారు. 

Balakrishna and Chiranjeevi

కాగా గతంలో బాలకృష్ణ రాజకీయాల్లో విఫలం చెందిన చిరంజీవి, అమితాబ్ లను ఎద్దేవా చేశాడు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ 2019 ఎన్నికల ముందు నాగబాబు వరుస వీడియోలు చేశాడు. బాలయ్యను ఓ రేంజ్ లో విమర్శించాడు. బాలయ్య నిజంగా అన్ స్టాపబుల్ షోలో తన సాంప్రదాయం కొనసాగిస్తే చిరంజీవి వద్ద ఈ వివాదం లేవనెత్తాలి. అయితే అల్లు-మెగా కుటుంబాల మధ్య ఇటీవల జరిగిన పరిణామాలు మరింత దూరం పెంచగా, చిరంజీవి అన్ స్టాపబుల్ షోకి వస్తారని చెప్పలేం. 

Latest Videos

click me!