`పుష్ప 2` సెట్‌కి కత్తి పట్టుకుని వెళ్లిన బాలయ్య, సుకుమార్‌ ని బెదిరిస్తూ వార్నింగ్‌, ఒక్కసారిగా అంతా షాక్‌

First Published | Sep 25, 2024, 7:19 PM IST

బాలకృష్ణ అంటే కొడతారనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కానీ `పుష్ప 2` సెట్‌కి ఏకంగా కత్తి పట్టుకుని వెళ్లాడట బాలయ్య. సుకుమార్‌కి చూపిస్తూ బెదిరింపులకు దిగాడట. 
 

బాలకృష్ణ.. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు. ఎన్టీ రామారావు తర్వాత నందమూరి ఫ్యామిలీలో ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నటుడు బాలయ్య. మూడో తరంలో చాలా మంది వచ్చినా కొడుకుగా తండ్రి పేరు నిలబెడుతున్నాడు. నాన్నగారి లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. అద్భుతమైన నటనతో, అత్యద్భుతమైన డైలాగ్‌ డెలివరీతో, గూస్‌బంమ్స్ తెప్పించే యాక్షన్‌తో, జోష్‌ నింపే డాన్సులతో ఆరు పదులు దాటినా ఇంకా అదే ఎనర్జీతో ఆడియన్స్ ని, అభిమానులను అలరిస్తున్నారు బాలయ్య. 
 

బాలయ్య అంటే చాలా మందికి భయం. ఆయన కొడతారనే ప్రచారం ఉంది. ఆయనకు ముక్కు మీద కోపం ఉంటుందని, దగ్గరికి వెళితే కొడతాడని అంటుంటారు. చాలా సందర్భాల్లో ఆయన అభిమానులను కొడుతూ కనిపించారు. ఆ వీడియోలు వైరల్‌ అయ్యాయి. సినిమా ఈవెంట్లలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

అందుకే ఆయనకు అలాంటి పేరు వినిపిస్తుంటుంది. కానీ ఆయనతో పనిచేసిన ఆర్టిస్టులు మాత్రం ఆయన చాలా సరదాగా ఉంటారని, నవ్విస్తుంటారని, చాలా జోవియల్‌గా కనిపిస్తారని చెబుతుంటారు. ఒక్కోక్కరికి ఒక్కోలా కనిపిస్తుంటారు బాలయ్య. తాను మాత్రం సరదాగానే ఉంటానని, నవ్విస్తుంటానని చెబుతుంటారు ఎన్బీకే.

ఏదైనా పబ్లిక్‌లో ఇబ్బంది పెడితే, ఇండీసెంట్‌గా బిహేవ్‌ చేస్తే కోపం వస్తుందని, ఆ సమయంలో అలా రియాక్ట్ కావాల్సి వస్తుందని ఆయన చెబుతారు. అయితే తన ఫ్యాన్స్ మాత్రం దాన్ని నెగటివ్‌గా తీసుకోరని, దాన్ని ప్రేమగానే భావిస్తారని తెలిపారు బాలయ్య. 
 


అంతేకాదు తోటి ఆర్టిస్టులతోనూ తాను సరదాగా ఉంటానని చెప్పారు బాలయ్య. యంగ్‌ జనరేషన్‌ హీరోలతో తాను కలిసిపోతుంటానని చెప్పారు. అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, విశ్వక్‌ సేన్‌, సిద్దు ఇలాంటి కుర్ర బ్యాచ్‌తోనూ ఫ్రీగా ఉంటానని, బ్రో అని పిలుచుకుంటామని తెలిపారు బాలయ్య. ఈ క్రమంలో ఓ ఆసక్తికర, షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు.

ఇటీవల జరిగిన ఓ సంఘటనని తెలిపారు. ఓ స్టూడియోలో తాను ఓ యాడ్‌ షూట్‌ చేస్తున్నారట. ఆ పక్కనే `పుష్ప 2` సినిమా షూటింగ్‌ అవుతుందట. తాను ఎక్కువ సేపు వెయిట్‌ చేయాల్సి వస్తుందని, దీంతో బోర్‌ కొట్టి పక్కనే `పుష్ప 2` షూటింగ్‌ అవుతుందని చెప్పి ఆ సెట్‌కి వెళ్లారట బాలయ్య.
 

ఆ సెట్‌లో అల్లు అర్జున్‌, సుకుమార్‌ ఉన్నారు. యూనిట్‌ అంతా ఉంది. అయితే వెళ్తూ వెళ్తూ తన సెట్‌ నుంచి ఓ కత్తిని తీసుకొని వెళ్లాడట బాలయ్య. ఆ కత్తిని వెనకాల పెట్టుకున్నాడు. సెట్‌కి వెళ్లాక అల్లు అర్జున్‌ కలిశారు. ఆయన సార్‌ అంటూ హగ్‌ చేసుకున్నారట. సార్‌ కాదు బ్రో అని పిలవాలని చెప్పాడట. దీంతో బన్నీ కూడా బ్రో అంటూ పిలవడం విశేషం.

ఈ ఇద్దరు కలవడం సెట్‌ అంతా సందడి వాతావరణం నెలకొంది. బన్నీ తాళ్లతో కట్టి ఉన్నాడు, షాట్‌ రెడీ అంటూ సుకుమార్‌ వచ్చారు. బాలయ్యని చూసి హలో సార్‌ అంటూ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి దగ్గరికి వచ్చారు సుకుమార్‌. అంతే బాలయ్య సడెన్‌గా వెనకాల నుంచి కత్తి తీసి సుకుమార్‌కి చూపిస్తూ బెదిరిస్తున్నారు. సుకుమార్‌ సైతం ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. 
 

అప్పుడు బాలయ్య నుంచి వచ్చిన డైలాగ్‌ ఏంటో తెలుసా? `మూడు నెలల్లో నాతో సినిమా తీస్తానని అన్‌ స్టాపబుల్‌లో మాటిచ్చావ్‌, ఇప్పుడు ఎప్పుడు తీస్తావ్‌` అంటూ బెదిరించాడట. బాలయ్య చేసిన పనికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. నవ్వుకున్నారు. కానీ కాసేపు మాత్రం అందరికి ఝలక్‌ ఇచ్చాడట బాలయ్య. ఇలా తాను సరదాగా ఉంటాననే విషయాన్ని చెప్పడం కోసం ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.

బాలయ్య `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` అనే టాక్‌ షోకి హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. ఈ షోకి బన్నీ, సుకుమార్‌ కలిసి వచ్చారు. ఆ సమయంలోనే బాలయ్యతో సినిమా చేస్తానని సుకుమార్‌ అన్నాడట. దాన్ని ఇలా సరదాగా ప్రశ్నించారు బాలయ్య.  
 

ఇటీవల సినిమాల్లోకి వచ్చిన యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారీ స్థాయిలో గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలోనే న్యూస్‌ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు బాలయ్య. ప్రస్తుతం ఆయన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య.. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇంకా పేరు ఖరారు చేయలేదు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు బాబీ. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ విడుదల కాబోతుందని తెలుస్తుంది. 
 

Latest Videos

click me!