దునియా విజయ్, నాగరత్న మధ్య కుటుంబ గొడవలు గతంలో పోలీస్ స్టేషన్, మీడియా, ఫ్యామిలీ కోర్టు వరకు వెళ్లాయి. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. ఫ్యామిలీ కోర్టు విడాకుల పిటిషన్‌ను తిరస్కరించడంతో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత, ఈ జంట మళ్లీ కలిసి జీవించడం అసాధ్యమని హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ధారించింది. దీంతో షరతులతో కూడిన విడాకులు మంజూరు చేసి, ఈ హై ప్రొఫైల్ కుటుంబ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది.
దునియా విజయ్ ఆ మధ్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ బాలయ్య హీరోగా నటించిన `వీరసింహారెడ్డి` చిత్రంలో విలన్‌గా నటించాడు. ఇక ప్రస్తుతం ఆయన ఐడీ రంగానికి చెందిన కీర్తి గౌడతో రిలేషన్‌లో ఉన్నాడు. ఇప్పుడు విడాకులు రావడంతో అధికారికంగా పెళ్లి చేసుకుంటారని సమాచారం.