తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసింది హీరోయిన్ నివేదా పేతురాజ్. అచ్చమైన అరవ అమ్మాయి నివేదా. కాని తమిళనాట ఎక్కువగా రాణించలేకపోయింది. తమిళనాడులో పుట్టి తమిళం బాగా మాట్లాడేవారికి తెలుగు మాదిరి అవకాశాలు ఇవ్వడంలేదనే విమర్శ ఉంది. ఈ విషయంలో బెస్ట్ ఎక్జాంపుల్ నివేదా పేతురాజ్. మదురైలో పుట్టిపెరిగిన ఆమె తమిళ సినిమాల ద్వారా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ లో ఉదయనిధి స్టాలిన్, జయం రవి, విజయ్ ఆంటోని,విజయ్ సేతుపతి లాంటి హీరోల సరసన మెరిసింది బ్యూటీ.
రజినీకాంత్ కూతురితో జయం రవి పెళ్ళి..? కొత్త బాంబ్ పేల్చిన సెలబ్రిటీ..
నివేదా మాట్లాడుతూ.. "నాకు ప్లం లిప్స్ అంటే చాలా ఇష్టం.. నా పెదాలు కూడా అలా మార్చుకోవాలని ప్రయత్నం చేశారు. దాని కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకున్నాను. ఈ విషయం మా ఫ్యామిలీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాను.. ఇంజెక్షన్ తీసుకుంటావా అని అడిగారు. సరే అన్నాను.. అయితే నిన్ను చంపేస్తాను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అని డాక్టర్ సరదాగా బెదిరించాడు. ఇలాంటివి మంచిది కాదని.. ఫ్యూచర్ లో చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కాని ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోయిన్లు ముఖాలు మార్చుకుని.. రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. కాని నన్ను అడిగితే ఇది మంచిది కాదు అనే చెపుతాను.. ఇలా సర్జరీ చేయించుకోకుండానే స్టార్ డమ్ ను చూసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. సాయి పల్లవి, నిత్యమీనన్ లాంటివారు ఏం సర్జరీలు చేయించుకోలేదు కదా..? అసలు వారుమేకప్ నే సరిగ్గా ఇస్టపడరు. అయినా వారు అందంగా ఉన్నారు కదా అని అన్నారు నివేదా పేతురాజ్ .