VeerasimhaReddy Event: ప్రత్యేక హెలికాప్టర్‌లో బాలయ్య, శృతిహాసన్‌ అదిరిపోయే ఎంట్రీ.. ఫోటోలు వైరల్‌

Published : Jan 06, 2023, 06:48 PM ISTUpdated : Jan 06, 2023, 06:55 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ `వీరసింహారెడ్డి` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆయనతోపాటు శృతి హాసన్‌, నిర్మాత ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఈవెంట్‌ లొకేషన్‌కి రావడం విశేషం. ఆయా ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
17
VeerasimhaReddy Event: ప్రత్యేక హెలికాప్టర్‌లో బాలయ్య, శృతిహాసన్‌ అదిరిపోయే ఎంట్రీ.. ఫోటోలు వైరల్‌

బాలకృష్ణ, శృతి హాసన్‌ కలిసి `వీరసింహారెడ్డి` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫ్యామిలీ యాక్షన్‌ ఎలిమెంట్లు మేళవించిన యాక్షన్‌ ఎంటర్టైనర్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. 
 

27

అందులో భాగంగా నేడు(శుక్రవారం) ఒంగోల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి బాలయ్య అండ్‌ `వీరసింహారెడ్డి` టీమ్‌ ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. లొకేషన్‌కి ప్రత్యేక హెలికాప్టర్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

37

ఇందులో బాలయ్య ఎంట్రీ అదిరిపోయిందని చెప్పొచ్చు. సినిమాల్లో హీరో మాదిరిగానే ఈ ఎంట్రీ ప్లాన్‌ చేయడం విశేషం. అలాగే శృతి హాసన్‌, నిర్మాత నవీన్‌ యెర్న్రేని, దర్శకుడు బి గోపాల్‌ ఈ ప్రత్యేక హెలికాప్టర్‌లో లొకేషన్‌కి చేరుకున్నారు. 
 

47

ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నందమూరి అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బాలయ్య లుక్‌ అదిరిపోయేలా ఉంది. 
 

57

మరోవైపు శృతి హాసన్‌ బ్లాక్‌ శారీలో మెరిసింది. ఆమె హెలికాప్టర్‌ నుంచి దిగి వస్తూ కొంటెగా కెమెరాలకు పోజులిచ్చింది. ఆమె పిక్స్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

67

మొదట `వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఒంగోల్‌లోనే ఏబీఎం కాలేజ్‌ గ్రౌండ్‌లో నిర్వహించాలను నిర్ణయించారు. కానీ పోలీస్‌ అధికారులు పర్మిషన్‌ ఇవ్వలేదు. భద్రతా కారణాలతో రిజెక్ట్ చేశారు. దీంతో పక్కనే ఉన్న ఇన్ఫ్రా గ్రౌండ్‌కి మార్చారు. 
 

77

సుమారు లక్ష వరకు బాలయ్య అభిమానులు ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వస్తారని తెలుస్తుంది. దీంతో ఇటు చిత్ర బృందం, అటు పోలీస్‌ అధికారులు, ఈవెంట్‌ నిర్వహకులు భారీగా ఏర్పాటు చేశారు. ఒంగోల్‌లో బాలయ్య సినిమా ఈవెంట్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. పైగా చిత్ర దర్శకుడు గోపీచంద్‌ మలినేని సొంతూరు కావడంతో ఈ ఈవెంట్‌కి ప్రత్యేకత సంతరించుకుంది. టీమ్‌ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories