అచ్చమైన తెలుగమ్మాయి, అలనాటి హీరోయిన్ మాధవి (Madhavi) కూడా విదేశీ అబ్బాయినే పెళ్లి చేసుకుంది. భారత - జర్మనీ సంతతికి చెందిన రాల్ఫ్ శర్మ అనే వ్యాపారిని 1996లో పెళ్లి చేసుకుంది. న్యూ జెర్సీలో స్థిరపడింది. ముగ్గురు పిల్లలు, భర్తతో హాయిగా గడుపుతోంది. కమల్ హాసన్ ‘మరోచరిత్ర’తో హీరోయిన్ గా మాధవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ నటించి అభిమానులను సొంతం చేసుకుంది.