NBK Satires: నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగాలకు చురకలు అంటించారు. సినిమా నిడివి విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ ఈ ఏడాది రెండు సినిమాలతో సందడి చేస్తున్నారు. సంక్రాంతికి `డాకు మహారాజ్`తో మెప్పించారు. ఇప్పుడు `అఖండ 2`తో వస్తున్నారు. ఈ శుక్రవారం నుంచి సినిమా విడుదల కాబోతుంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తోన్న నాల్గో సినిమా కావడం, హిట్ కాంబినేషన్ కావడం, ఆ అంచనాలకు కారణం కావచ్చు.
26
స్టార్ డైరెక్టర్లకు బాలయ్య చురకలు
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ పాల్గొంటూ బిజీగా ఉన్నాడు బాలయ్య. వరుసగా పలు సిటీస్‌లో ఈవెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ముంబయిలో, హైదరాబాద్‌లో, చెన్నైలో, బెంగుళూరులో ఈవెంట్లు చేశారు. అదే సమయంలో వరుసగా టీమ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలుగు టీమ్ ఇంటర్వ్యూలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల నిడివిపై ఆయన స్టార్ డైరెక్టర్లకు చురకలు అంటించారు. ఇటీవల కాలంలో రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు తమ సినిమాలను మూడు గంటలకుపైగా రూపొందిస్తున్నారు.
36
కథ ఉండదు మూడు, మూడున్నర గంటల సినిమాలు
దీనిపై బాలయ్య స్పందిస్తూ, `ఈ మధ్య కొన్ని సినిమాలు మూడు గంటలు, మూడున్నర గంటలు ఉంటున్నాయి. అందులో కథ ఉండదు, పాయింట్ చిన్నదే కానీ మూడు, మూడున్నర గంటలకుపైగా నిడివి ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. మేం ఇంత పెద్ద సినిమా చేసి మూడు గంటల లోపే తీశాం` అని తెలిపారు బాలయ్య. సినిమా నిడివి దృష్ట్యా ఇందులో హీరోయిన్ పాత్రనే లేపేసినట్టు తెలిపారు. మొదటి భాగంలో ప్రగ్యా జైశ్వాల్ పాత్ర ఉంటుంది. ఆమె ఇందులో ఏం చేస్తుందని ఆలోచించి సెట్ కావడం లేదని తీసేసినట్టు తెలిపారు బాలయ్య. నిడివిని దృష్టిలో పెట్టుకొనే ఆ పాత్రని కట్ చేసినట్టు వెల్లడించారు. అదే సమయంలో ఇందులో కొత్తగా హర్షాలి పాత్ర వస్తుంది, దీంతోపాటు సంయుక్త పాత్ర వస్తుందన్నారు.
సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, రాజమౌళిలపై సెటైర్లు
ఇప్పుడు సినిమాకి నిడివి ఎంత ఉండాలనేది కూడా చాలా ముఖ్యం. ఆడియెన్స్ ని థియేటర్లో కూర్చోబెట్టాలి. ఎక్కువ నిడివి ఉంటే ఆడియెన్స్ బోర్ ఫీలవుతారని తెలిపారు. అందుకే తాము పెద్ద సినిమా చేసినా నిడివి ఎంత ఉండాలో అంతే ఉంచామని టీమ్ ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పారు. పరోక్షంగా ఆయన సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి, సుకుమార్ లకు చురకలు అంటించారు. ఇటీవల కాలంలో వారి సినిమాలే మూడు గంటలకుపైగా నిడివితో ఉంటున్నాయి. `అఖండ 2` రెండు గంటల 44 నిమిషాల నిడివితో విడుదల కాబోతుంది.
56
మూడు గంటలకుపైగా నిడివితో సినిమాలు
`ఆర్‌ఆర్‌ఆర్`, `పుష్ప 2`, `యానిమల్` చిత్రాలు మూడు గంటలకుపైగా నిడివితోనే విడుదలైన విషయం తెలిసిందే. అవి బాక్సాఫీసు వద్ద సంచలన విజయాలు సాధించాయి. నిడివి ఎక్కువగా ఉన్నా, బాక్సాఫీసుని షేక్ చేశాయి. వందల, వేల కోట్లు వసూలు చేశారు. మరి బాలయ్య సినిమాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా రూ.150కోట్లు దాటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ఈ కామెంట్స్ చేయడం ఆశ్చర్యకరంగా, చర్చనీయాంశంగా మారింది.
66
డిసెంబర్ 5న గ్రాండ్‌గా `అఖండ 2` విడుదల
`అఖండ 2` చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తుండగా, పూర్ణ, హర్షాలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది.