బాలకృష్ణ `సింహ` పేరుతో చాలా సినిమాలు చేశారు. ఒక రకంగా అది ఆయనకు బాగా కలిసి వచ్చింది. వీటిలో చాలా వరకు విజయాలు సాధించాయి. మొన్న వచ్చిన `వీరసింహారెడ్డి`, `జై సింహ`, `సింహ`, `సమరసింహారెడ్డి`, `నరసింహ నాయుడు`, `సీమ సింహం`, `లక్ష్మీ నరసింహ`, `బొబ్బిలి సింహం`, `సింహం నవ్వింది` వంటి చిత్రాలు చేశారు. ఇందులో `వీరసింహారెడ్డి`, `సింహ`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు`, `లక్ష్మీ నరసింహ`, `బొబ్బిలి సింహం` చిత్రాలు హిట్ అయ్యాయి. `జైసింహ` యావరేజ్‌గా ఆడింది. `సీమసింహం` పెద్దగా ఆడలేదు. ఇందులో పెద్ద డిజాస్టర్ అంటే `సింహం నవ్వింది` అనే చెప్పాలి.