Karthika Deepam 2 Today Episode:జ్యో మాస్టర్ ప్లాన్-శౌర్య కిడ్నాప్-కార్తీక్ టెన్షన్-జ్యోకు వార్నింగ్

Published : Mar 18, 2026, 08:21 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 18వ తేదీ)లో కార్తీక్ ని హాస్పిటల్ వదిలి వెళ్లొద్దన్న డాక్టర్. శౌర్యను కిడ్నాప్ చేయించిన జ్యో. కూతురి కోసం దశరథ హోమం. దీపను హాస్పిటల్ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేసిన పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు ఇక ఆపేయ్ జ్యోత్స్న అంటాడు దాసు. నేను నీ కూతురిని అని ఒప్పుకో అంటుంది జ్యోత్స్న. ఒప్పుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటాడు దాసు. నువ్వు ఊహించిన దానికంటే కూడా నా చేతలు భయంకరంగా ఉంటాయి. నువ్వు నన్ను ఏం చేయలేవ్? ఎందుకంటే నేను దశరథ కూతురిని అని చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్న. సుమిత్ర వదినకు ఆపరేషన్ అయ్యేంత వరకే నీ ఆటలు.. తర్వాత నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు దాసు.

27
జ్యో టెన్షన్

మరోవైపు రెడీనా అనుకుంటూ జ్యోత్స్న దగ్గరికి వస్తుంది పారు. ఏంటి రెడీ? నేనేంటి, మా మమ్మీని కాపాడటం ఏంటి? అని అంటుంది పారు. సుమిత్ర కూతురివి నువ్వే కాబట్టి నువ్వే కాపాడాలి అంటుంది పారు. లోపల టెన్షన్ తో వణికిపోతున్నాను. నాకు నీ సపోర్ట్ కావాలి గ్రానీ అంటుంది జ్యోత్స్న. సరే అంటుంది పారు. టెన్షన్ ఎందుకమ్మా.. ఈ రోజుతో అన్ని సమస్యలు తీరిపోతాయి కదా అంటాడు దశరథ. అంతలో సుమిత్ర, శివన్నారాయణ కూడా వస్తారు.

37
నీ కూతురే నిన్ను కాపాడుతుంది

పదండి హాస్పిటల్ కి వెళ్దాం అంటాడు శివన్నారాయణ. సుమిత్ర ఇంటిని, మనుషులను ఒకసారి చూసి, మళ్లీ మీ అందరినీ చూస్తానో లేదో భయంగా ఉందండి అని దశరథతో అంటుంది. నీకేం కాదు. నీ కూతురు నిన్ను కాపాడుతుంది. ఏంటమ్మా జ్యోత్స్న నిజమే కదా అంటాడు దశరథ. అవును డాడీ మమ్మీకి ఏం కాదు అని హాస్పిటల్ కి బయల్దేరుతారు. జ్యోత్స్నతో నువ్వు అమ్మను తీసుకొని హాస్పిటల్ కు వెళ్లు, నాకు చిన్నపని ఉంది చూసుకొని వస్తాను అని చెప్తాడు దశరథ.

47
డాక్టర్ టెన్షన్

మరోవైపు డాక్టర్ హారిక టెన్షన్ పడుతుంటుంది. జ్యోత్స్న, పారిజాతం, శివన్నారాయణ గారికి తెలియకుండా మనం ఆపరేషన్ చేయగలమా.. ఇంత టెన్షన్ నేను ఎప్పుడు పడలేదు కార్తీక్. నాకు, నా హాస్పిటల్ కి చెడ్డపేరు రాకుండా ఈ ఆపరేషన్ పూర్తి కావాలి అంటుంది డాక్టర్. అన్నీ నేను చూసుకుంటాను. మీరు టెన్షన్ పడకండి డాక్టర్ అని చెప్తాడు కార్తీక్. ఆపరేషన్ పూర్తయ్యేవరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్లకు అని కార్తీక్ తో చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్.

ఇంతలో కార్తీక్ కి శ్రీధర్ కాల్ చేసి శౌర్య కనిపించడం లేదని చెప్తాడు. జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని తండ్రిపై అరిచి, నీ ప్రయత్నం నువ్వు చేయి, నా ప్రయత్నం నేను చేస్తాను అంటాడు కార్తీక్. దీపతో అసలు విషయం చెప్పకుండా శౌర్య స్కూల్ వరకు వెళ్లివస్తాను అని చెప్పి బయటకు వస్తాడు. అప్పుడే సుమిత్ర వాళ్లు హాస్పిటల్ కి వస్తారు.

57
జ్యోకు కార్తీక్ వార్నింగ్

శౌర్యను, జ్యోత్స్న కిడ్నాప్ చేయించందని డౌట్ పడతాడు కార్తీక్. బావకు శౌర్య మిస్సింగ్ గురించి తెలిసినట్లుందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఎక్కడికి రా ఇంత హడావిడిగా వెళ్తున్నావు అంటుంది సుమిత్ర. వాడ్ని ఏం అడగకు సుమిత్ర, వాడు ఏం చెప్పడు, పెద్దవాడు అయిపోయాడు అంటాడు శివన్నారాయణ. బావ ఏదో టెన్షన్ లో ఉన్నాడు అంటుంది జ్యోత్స్న. ఈ టెన్షన్ ఎందుకు పడుతున్నానో కూడా తమరికే తెలిసే ఉంటుంది. అందరి ఆట కట్టిస్తాను. తప్పును వెంటనే సరిచేసుకుంటే మంచిది. లేకుంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.

67
దశరథ హోమం

మరోవైపు గుడిలో హోమం చేయడానికి కూర్చొంటాడు దశరథ. నా భార్య బ్రతకాలంటే దీప బోన్ మ్యారో ఇవ్వాలి. దీపకు ఆపరేషన్ చేస్తే కడుపులో బిడ్డ బ్రతకదు. ఎవ్వరికీ ఏం కాకుండా చూసుకో స్వామి. నేను కోరుకున్న శుభవార్త వినాలి అని మనసులో అనుకొని హోమం మొదలుపెడతాడు దశరథ.

77
దీపకు నిజం చెప్పిన పారు

దీప దగ్గరకు వెళ్లి నువ్వు ఇంత నింపాదిగా కూర్చున్నావేంటి కార్తీక్ నీతో నిజం చెప్పలేదా అని అడుగుతుంది పారు. ఏంటా నిజం, ఏమైంది అని అడుగుతుంది దీప. శౌర్య కనిపించడం లేదటా. నువ్వేమో కళ్లముందు ఓ బిడ్డ ఉందని కడుపులో బిడ్డను వద్దనుకున్నావు. ఇప్పుడు ఇది పోతుంది. అది పోతుంది. వెళ్లి నీ బిడ్డను వెతుక్కో అంటుంది పారు. దీప కంగారుగా బయటకు వెళ్తుంటే డాక్టర్ ఎదురుగా వస్తుంది. 

ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్లకూడదు. సుమిత్ర గారిని ఆపరేషన్ రెడీ చేస్తున్నాము అని చెప్తుంది డాక్టర్. సుమిత్రను ఆపరేషన్ కు రెడీ చేయడానికి, దీప ఇక్కడ ఉండటానికి సంబంధం ఏంటి డాక్టర్ అంటూ గదిలోనుంచి బయటకు వస్తుంది పారు. షాక్ అవుతుంది డాక్టర్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories