బేబీ మూవీ వెనుక పెద్ద స్కామ్, సాయి రాజేష్ ఆఫీస్ లోనే.. తమిళనాడులో జరిగిన సంఘటనే ప్రేరణ, సంచలన విషయాలు

First Published Jun 24, 2024, 9:49 AM IST

సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్ కె ఎన్ నిర్మాణంలో యువ నటి వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. చిన్న సినిమాగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యే విధంగా బంపర్ హిట్ అందుకుంది.

సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్ కె ఎన్ నిర్మాణంలో యువ నటి వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. చిన్న సినిమాగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యే విధంగా బంపర్ హిట్ అందుకుంది. నిర్మాతకి ఈ చిత్రంతో లాభాల పంట పండింది. 

ఈ చిత్రం విడుదలైన కొంత కాలానికి షిరిన్ శ్రీరామ్ అనే వర్తమాన దర్శకుడు బేబీ కథ తనదే అని.. సాయి రాజేష్ దొంగిలించారు అంటూ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. ఆ కథ తనదే అని చెప్పడానికి అనేక ఆధారాలని కూడా షిరిన్ శ్రీరామ్ బయట పెట్టాడు. అంతే కాదు బేబీ లీక్స్ అంటూ ఒక బ్లాగ్ స్పాట్ ని క్రియేట్ చేసి అందులో అన్ని విషయాలని, ఆధారాలని వివరంగా పొందు పరిచయారు. 

Gayathri Gupta

నటి గాయత్రీ గుప్తా.. షిరిన్ కి స్నేహితురాలు. తన ఫ్రెండ్ కి మద్దతు తెలిపేందుకు ఆమె కూడా మీడియా ముందుకు వచ్చింది. బేబీ సినిమా కథ షిరిన్ దే అని అందులో అనుమానం అవసరం లేదని గాయత్రీ గుప్తా తెలిపింది. బేబీ సినిమా కథని షిరిన్ రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి విషయం తనకి తెలుసు అని పేర్కొంది. ఎందుకంటే షిరిన్ తనకి ఈ చిత్రంలో కీలక పాత్ర ఉందని చెప్పి లుక్ టెస్ట్ కూడా చేశాడు. ఆ ఫోటోలు కూడా గాయత్రీ గుప్తా చూపించింది. 

బేబీ సినిమా వెనుక డైరెక్టర్ సాయి రాజేష్ పెద్ద స్కామ్ చేశాడు. షిరిన్ నుంచి ఈ కథ దొంగిలించాడు. 2015లో ఈ మొత్తం వ్యవహారం మొదలయింది. షిరిన్ ఈ కథ రాయడానికి ప్రేరణ 2015లో తమిళనాడులో జరిగిన ఒక సంఘటన అని గాయత్రీ గుప్తా తెలిపింది. తమిళనాడులో ఒక బస్తీ యువతి ఇద్దరు కుర్రాళ్ళని ప్రేమించి మోసం చేసింది. దీనితో ఆమెని వాళ్లిద్దరూ చంపేశారు. ఆ వార్త మీడియాలో వచ్చింది. 

దీని ఆధారంగా కథ రాయాలని షిరిన్ మొదలు పెట్టాడు. ఆ సమయంలో నేను కొబ్బరిమట్ట చిత్రంలో సాయిరాజేష్ దర్శకత్వంలో నటిస్తున్నా. షిరిన్ కూడదా సాయి రాజేష్ ప్రొడక్షన్ హౌస్ అమృత ప్రొడక్షన్స్ లో పనిచేస్తున్నారు. అక్కడ ఒక రూంలో షిరిన్ బోర్డు పెట్టుకుని బేబీ కథని తన టీంతో డెవలప్ చేస్తున్నాడు. ఈ విషయం సాయి రాజేష్ కి తెలుసు. 

కథ పూర్తయ్యాక షిరిన్ సాయి రాజేష్ కి చెప్పాడట. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని మాట ఇచ్చాడట. కానీ సాయి రాజేష్ ఆ చిత్రాన్ని నిర్మించలేదు. కట్ చేసే 2023లో బేబీ చిత్రాన్ని అతడే డైరెక్ట్ చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది.. అది తాను రాసుకున్న 'ప్రేమించొద్దు' అనే కథ అని. ముందుగా ఈ చిత్రానికి షిరిన్ కన్నా ప్లీజ్ అనే టైటిల్ అనుకున్నారు. 

గాయత్రీ గుప్తా మాట్లాడుతూ తమిళనాడులో జరిగిన సంఘటనలో అమ్మాయి స్కూల్ కి వెళ్లే అమ్మాయి కాదు. ఆమె స్కూల్ గర్ల్ అని ఎక్కడా రాలేదు. కానీ మన సినిమాలో ఆమె పాత్రని స్కూల్ అమ్మాయిలా చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన షిరిన్ కి వచ్చింది. దీనితో నన్ను వెంటనే పిలిచి స్కూల్ పిల్లలాగా యూనిఫాం గెటప్ లో ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలు కూడా గాయత్రి చూపించింది. ఆ లుక్ నే ఫైనల్ చేశారట. దానిని కూడా సాయిరాజేష్ బేబీ సినిమాలో కాపీ కొట్టారు. 

షిరిన్ రెడీ చేసిన కథకి కాస్త మసాలా పూసి అదేవిధంగా తెరకెక్కించారని గాయత్రీ గుప్తా, షిరిన్ ఇద్దరూ ఆరోపిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక కథ రాసుకుని డైరెక్ట్ చేయాలని అనుకోవడం ఇండస్ట్రీలో మామూలు విషయం కాదు.. దాని వెనుక ఎంత కాస్త ఉంటుంది ? ఆ కష్టాన్ని ఇలా దొంగిలిస్తే ఊరుకుంటామా అంటూ గాయత్రీ గుప్తా తెలిపింది. షిరిన్ ఈ కథని రెడీ చేసే క్రమంలో ఓ సినిమా టోగ్రాఫర్ కి, తన స్నేహితలకి కథని వివరించారు. 

బేబీ సినిమా రిలీజ్ కాగానే.. అదేంటి నీ కథతో సాయిరాజేష్ సినిమా చేశాడు అంటూ వాళ్లంతా పంపిన మెసేజ్ లని కూడా షిరిన్ తన బేబీ లీక్స్ బ్లాగ్ స్పాట్ లో పొందుపరిచారు. ఈ విషయంలో తప్పకుండా షిరిన్ కి న్యాయం జరగాలని గాయత్రీ గుప్త డిమాండ్ చేస్తోంది. 

Latest Videos

click me!