బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ - హరికృష్ణ ఎందుకు రాలేదు..? కారణం వింటే షాక్ అవుతారు..?

Published : Jul 17, 2024, 03:20 PM IST

స్టార్ హీరో, హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెళ్ళికి .. ఆయన తండ్రి ఎన్టీఆర్.. అన్న హరికృష్ణ హాజరు కాలేదట ఎందుకో తెలుసా...?   

PREV
18
బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ - హరికృష్ణ ఎందుకు రాలేదు..? కారణం వింటే షాక్ అవుతారు..?

నందమూరి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే.. అన్న ఎన్టీఆర్ నుంచి బాలయ్య, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. నారా ఫ్యామిలీ.. దగ్గుబాటి ఫ్యామిలీ.. ఇలా నందమూరి ఫ్యామిలీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని, రాష్ట్రాన్ని ఏలుతున్నారు ఎన్టీఆర్ ఫ్యామిలీ. ఈక్రమంలో బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నటవారసత్వం నిలబెట్టిన హీరో. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇప్పటికీ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు బాలయ్య. 
 

All So Read :  జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

28
Balakrishna

ఇక తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించారు బాలకృష్ణ. గతంలో అన్న హరికృష్ణ ప్రాతినిత్యం వహించిన హిందూపూర్ నుంచి రీసెంట్ గా మూడో సారి గెలిచాడు బాలయ్య. ఇక సినిమాల్లో కూడా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి విజయ విహారం చేస్తున్నాడు. ఈక్రమంలో బాలయ్యకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 

AllSo Read : రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

38

నందమూరి ఇంట ఏ పండగ జరిగినా.. పెళ్ళి జరిగినా.. గొప్ప సందడిగా ఉంటుంది. పెద్దాయన కొడుకులు,కూతుర్లు, మనవళ్ళు మనవరాళ్లతో సందడి వాతావరణం ఉంటుంది. ఇప్పటికీ నందడమూరి ఫ్యామిలీలో  ఇదే కొనసాగుతుంది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే.. నందమూరి నట వారసుడు బాలకృష్ణ పెళ్ళికి మాత్రం ఆయన తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ రాలేదట. ఇది వింటానికి షాకింగ్ గా అనిపించిన నిజం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 

AllSo Read ; అమ్మ శ్రీదేవి చివరి కోరిక తీర్చుతున్న జాన్వీ కపూర్.. అతిలోక సుందరి చివరి కోరిక ఏంటంటే..?

48

అయితే సొంత కొడుకు పెళ్ళికి సీనియర్ ఎన్టీఆర్.. సొంత తమ్ముడు పెళ్ళికి అన్న హరికృష్ణ రాకపోవడం ఏంటి అని ఆశ్చర్యంగా ఉండొచ్చు.. బాలయ్య ఏమైనా ప్రేమ పెళ్ళి చేసుకున్నాడా..? ఆ కోపంతో వారు పెళ్ళికి రాలేదా అనే సందేహాలు కూడా వచ్చి ఉంటాయి.

 

జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ వెంకటేష్ సినిమా ఏదో తెలుసా..?

58
Balakrishna

కాని బాలకృష్ణ ‌ - వసుందరా దేవిది పెద్దలు కుదిర్చిన వివాహమే.  వ‌సుంద‌ర దేవి తండ్రి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త దేవుర‌ప‌ల్లి సూర్యారావు. ఇక 1982 డిసెంబ‌ర్ 8న వ‌సుంద‌ర దేవి బాల‌య్య వివాహం జ‌రిగింది.  వీరి పెళ్లి శుభ‌లేఖ నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీరి పెళ్ళి తిరుపతిలోని కర్నాటక మండపంలో జరిగినట్టు అందులో ఉంది. అయితే ఈ పెళ్ళికి  పెద్దాయన రాకపోవడానికి ఓ పెద్ద కారణమే ఉంది. అదేంటంటే..? 

68

సరిగ్గా బాలకృష్ణ పెళ్ళి జరిగేసమయానికి ఎన్టీఆర్ ప్రజా చైతన్య యాత్రలో ఉన్నారు. అవును బాలయ్య పెళ్ళి 1882 డిసెంబర్ లో అయ్యింది. సరిగ్గా అదే టైమ్ లో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ప్రజాచైతన్య యాత్ర పేరుతో ఫుల్ బిజీగా ఉన్నారు. యాత్ర యమా జోరుగా సాగుతోంది.. జనాలుతండోప తండాలుగా వస్తున్నారు. ఎన్టీఆర్ కు జన నీరాజనాలు పలుకుతున్నారు. ఈక్రమంలో యాత్రంకు బ్రేక్ ఇవ్వడం కుదరక.. ఎన్టీఆర్ పెళ్ళికి రాలేదట. దాంతో ఎన్టీఆర్ లేుకుండానే బాలయ్య పెళ్ళి జరిగింది. 
 

78

అయితే ఈ ప్రజా చైతన్య యాత్రకు రధసారధిగా  ఉన్నారు హరికృష్ణ. ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న బండిని ఆయనే డ్రైవ్ చేశారు. దాంతో హరికృష్ణకు కూడా బాలకృష్ణ పెళ్ళికి రాలేదట. అయితే పెళ్ళి తరువాత బాలయ్య సరాసరి వెళ్ళి.. యాత్రలో ఉన్న ఎన్టీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారట. అంతే కాదు బాలకృష్ణతో పాటు.. ఆయన అన్న రామకృష్ణ పెళ్ళి కూడా ఒకేసారి అయినట్టు సమాచారం. 
 

88

ఇలా ఎన్టీఆర్ ప్రజల కోసం తన సొంత కొడుకు పెళ్ళికి కూడా పోకపోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసిందట. ప్రజల్లో అన్నగారిపై మరింత నమ్మకాన్ని.. గౌరవాన్నిపెంచిందని అంటుంటారు. అంతే కాదు పార్టీ పెట్టిన 9 నెలల్లో పెద్దాయన ఎలక్షన్స్ కు వెళ్ళి.. భారీ మెజారిటీతో గెలుపొంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చైతన్య రధసారధిగా ఉన్న హరికృష్ణ రావాణా శాఖా మంత్రిగా పనిచేశారు. ఆడవారికి ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీట్లు ఆయన ప్రవేశ పెట్టినదే. 
 

Read more Photos on
click me!

Recommended Stories