మోక్షజ్ఞ కు తల్లి పాత్రలో బాలకృష్ణ హీరోయిన్, బాలయ్యతో సూపర్ హిట్ మూవీస్ చేసిన తార ఎవరో తెలుసా..?

First Published | Oct 17, 2024, 5:56 PM IST

నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీకి అంతా సిద్దం అయ్యింది. ఇక ఆయన సరసన  హీరోయిన్ కోసం వేట మొదలయ్యింది. అయితే మోక్షు తల్లి పాత్రలో మాత్రం.. బాలయ్య సరసన హీరోయిన్ గా చేసిన స్టార్ నటి ఫిక్స్ అయ్యిందట. ఇంతకీ ఎవరామె. 
 

Mokshagna

నందమూరి నట వారసుడిగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ  ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. . అభిమానులంతా కళ్లు కాయలు కాచేలా ఎదరు చూస్తున్న తరుణం త్వరలో ఉండటంతో.. అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక బాలయ్య తన కొడుకు ఎంట్రీకి సబంధించిన  సినిమా విషయంలో ప్రతీది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎక్కడా కాస్త కూడా తేడారాకుండా జాగ్రత్తపడుతున్నాడు.  

Also Read: శ్రీదేవికి చిరంజీవి భార్య చేసిన ఆ కూర ఎంత ఇష్టమో తెలుసా,
 

హీరోయిన్ విషయంలో.. ఇతర ప్రధాన పాత్రల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ తో కలిసి.. ఆయన హర్ట్ అవ్వకుండా.. సూచనలు ఇస్తూ.. అతని నిర్ణయాలకు విలువ ఇస్తూ.. సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో మోక్షజ్ఞ జంటగా నటించబోయే హీయిన్ పై  రకరకాల వార్తలు వైరల్ అవుతుండగా.. ఈసినిమాలో హీరో తల్లి పాత్ర కోసం ఓ మాజీ హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. 

మోక్షజ్ఞ వెండి తెరమీద ఎప్పుడు హీరోగా కనిపిస్తాడా  అని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదరు చూస్తున్నారు. అయితే మూవీ టీమ్ మాత్రం ప్రతీ విషయంలో ఆచి తూచి అడుగేస్తున్నారు.  ఈ ఏడాది మోక్షజ్ఞ  సినిమా ప‌ట్టాలెక్కనుంది. హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది సినీ అభిమానులను పూనకాలతో ఊపేసిన యుగ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖరీదైన విడాకులు: టాప్ 10 జంటలు వీళ్ళే..


ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. మోక్షజ్ఞ  సినిమాలో  హీరో తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందంట. ఈ పాత్ర కోసం చాలామంది పేర్లను దర్శకుడు  పరిశీలించాడట. చివరకు ఓ పేరు ఖరారయినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు మాజీ హీరోయిన్ శోభన పేరు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. 

Also Read: బ్రహ్మానందం - ఆలి ఆల్కాహాల్ తాగకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

అయితే ఈమె పేరును బాలయ్య కూడా ఒకే చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ హీరోయిన్ తో సూపర్ హిట్ సినిమా చేశారు బాలయ్య. గతంలో బాలయ్య తో కలిసి శోభన  నారీ నారీ నడుమ మురారి సినిమాలో నటించింది. ఈసినిమాతో పాటు మువ్వగోపాలుడు సినిమాలోని నటించింది.

 చాలా గ్యాప్ తరువాత శోభన రీసెంట్ గా టాలీవుడ్ సినిమాలో నటించింది.  ‘కల్కి 2898 ఎడి’ సినిమాలో కనిపించింది. ఇక  ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో తల్లి పాత్రకు ఆమెను సంప్రదించడంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.ఇక  శోభ‌న ఇలాంటి పాత్రలో అది కూడా తెలుగు సినిమాలో కనిపించలేదు. సో ఈసినిమాకు ఆమె ఖ‌చ్చితంగా ప్ల‌స్ అవుతుంది అంటున్నారు. 

Also Read:. డైరెక్టర్ పై మహేష్ బాబు సీరియస్....?

Mokshagna

ఇక హీరో విషయానికి వస్తే.. గత కొంత కాలంగా మోక్షజ్ఞ లో మార్పును కూడా ఆడియన్స్ గమనిస్తున్నారు. ఇంతకు ముందు లావుగా..బొద్దుగా షేప్ అవుట్ అయి ఉండే వాడు నందమూరి వారసుడు. రీసెంట్ గా మోక్షజ్ఞ లుక్ చూసి.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. స్లిమ్ గా ఫిట్ గా.. డిపరెంట్ హెయిర్ స్టైల్ తో.. హ్యాండ్సమ్ అండ్ క్యూట్ లుక్స్ లో కనిపించాడు మోక్షజ్ఞ. ఈయంగ్ హీరో లుక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. 

మోక్షజ్ఞ సినిమా హిట్ అయితే.. ఇండస్ట్రీలో తారక్ తరువాత నందమూరి వంశం నుంచి మరో స్టార్ హీరో తెరపై మెరిసే అవకాశం ఉంది. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞకు భారీగా ఎలివేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.  అటు ఎన్టీఆర్ కూడా తన తమ్ముడికి విష్ చేస్తూ.. ట్వీట్ చేశారు. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోేసం క్లిక్ చేయండి.
 

Latest Videos

click me!