రాజమౌళి మహాభారతంలో బాలయ్య, జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ లో బాలకృష్ణ పాత్ర ఏంటో తెలుసా?

Published : Feb 19, 2026, 03:58 PM IST

రాజమౌళి - బాలకృష్ణ కాంబినేషన్ పై గతంలో చాలా డిస్కర్షన్స్ జరిగాయి. అన్ స్టాపబుల్ షో లో కూడా బాలయ్య ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. ఎట్టకేలకు ఈ పవర్ ప్యాక్ కాంబినేషన్ కలవబోతున్నట్టు తెలుస్తోంది. 

PREV
14
రాజమౌళి - బాలయ్య కాంబినేషన్..

రాజమౌళి తన కెరీర్ లో యంగ్ స్టార్స్ తోనే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. టాలీవుడ్ నాలుగు పిల్లర్స్ అయిన చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జునతో జక్కన్న సినిమాలు చేయలేదు. అయితే ఈ నలుగురిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య తో రాజమౌళి సినిమా గురించి చాలా రూమర్స్ వచ్చాయి. వీరి కాంబోలో సినిమాలు ఎప్పుడు వస్తాయా అని అంతా ఎదురు చూశారు. ముఖ్యంగా బాలయ్యతో రాజమౌళి కాబినేషన్ గురించి ఎక్కువగా ఇండస్ట్రీలో చర్చించుకున్నారు. ఓ సందర్భంలో రాజమౌళి బాలయ్యతోసినిమా గురించి స్పందించారు. బాలయ్య కూడా రాజమౌళిని ఈ విషయంపై ప్రశ్నించారు.

24
అన్ స్టాపబుల్ షోలో ఏం జరిగింది?

గతంలో జరిగిన అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ రాజమౌళిని ఇంటర్వ్యూ చేస్తూ.. వారి కాంబినేషన్ గురించి అడిగారు. బాలయ్య మాట్లాడుతూ.. '' మన కాంబినేషన్ గురించి చాలా కాలంగా డిస్కర్షన్ నడుస్తోంది. నా అభిమానులు కూడా అడుగుతున్నారు.. కానీ నన్ను హ్యాండిల్ చేయలేను అన్నావట కదా.. ఏంటి సంగతి. '' అని అడిగారు. రాజమౌళి స్పందిస్తూ.. '' మీకు కోపం ఎక్కువ అని.. ఎవరిని పడితే.. వారిని కొడతారని, ఎంతటివారినైనా లెక్క చేయరని అంతా అంటుంటారు. కానీ మీ మంచితనం మంచి మనసు గురించి చాలామందికి తెలియదు. దర్శకులకు మీరు ఎంత విలువిస్తారో మాకు తెలుసు. డైరెక్టర్ ఎంత చిన్నవారైనా.. వారు చెప్పిందే ఫైనల్.. దర్శకుడు ఏం చెపితే అది చేస్తారు.. ఆయన పేకప్ అన్న తరువాతే క్యారెవాన్ ఎక్కుతారు. '' అని బాలయ్య గొప్పతనం గురించి వివరించారు.

34
రాజమౌళితో బాలకృష్ణ సినిమా ఎప్పుడు?

వారణాసి సినిమాతో మరోసారి సంచలనం సృష్టించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు రాజమౌళి.. ఈ సినిమా అనంతరం ‘మహాభారతం’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మహాభారతం లో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక పాత్ర ఇవ్వాలనే రాజమౌళి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

అయితే ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనే విషయంపై అధికారిక స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ బాలకృష్ణకు తెలుగు భాషపై ఉన్న పట్టు, పురాణ పాత్రలపై ఆయనకున్న ఆసక్తి దృష్ట్యా ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఆయనను భాగస్వామ్యం చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

44
భారతంలో బాలయ్య పాత్ర..

మహాభారతంలో అనేక ప్రధాన పాత్రలు ఉన్న నేపథ్యంలో బాలకృష్ణకు సరిపోయే పాత్రలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దుర్యోధనుడి పాత్ర కానీ, ధర్మరాజు పాత్ర కానీ.. చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ. సోషల్ మీడియాలో మాత్రం మ్యాటర్ వైరల్ అవుతోంది.

 రాజమౌళి తన సన్నిహితులతో కొన్ని సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. నిజంగా ‘వారణాసి’ సినిమా అనంతరం ‘మహాభారతం’ ప్రాజెక్ట్ ప్రారంభమైతే, పలువురు స్టార్ హీరోలు తమ డేట్స్‌ను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు వారణాసి రిలీజ్ తరువాతే వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories