తెలంగాణలో బాలకృష్ణ ఇంటర్నేషనల్‌ స్టూడియో, ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. తెరవెనుక చక్రం తిప్పుతున్న సీఎం?

First Published Oct 26, 2024, 8:42 PM IST

బాలకృష్ణ వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు. ఆయన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణలో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో స్టూడియో నిర్మాణానికి ప్లాన్‌ చేస్తున్నారట. 
 

నందమూరి బాలకృష్ణ త్వరలో స్టూడియో హోనర్‌ కాబోతున్నారు. ఆయన కూడా ఫిల్మ్ స్టూడియో నిర్మించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రముఖులకు స్టూడియోలున్నాయి. నాగార్జున(ఏఎన్నార్‌)కి అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ ఉంది. నిర్మాత రమేష్‌ ప్రసాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌ ఉంది. అలాగే సురేష్‌బాబు, వెంకటేష్‌(రామానాయుడు)లకు రామా నాయుడు స్టూడియోస్‌ ఉన్నాయి. రెండు మూడు చోట్ల వాళ్లకి ఈ స్టూడియోలుండటం విశేషం. అలాగే సూపర్‌ స్టార్‌ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరి రావు నిర్వహిస్తున్న పద్మాలయ స్టూడియో ఉంది, సారధి స్టూడియో ఉంది. ఇటీవలే అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ ఓ స్టూడియోని నిర్మించారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Balakrishna

ఇవన్నీ ఓ ఎత్తైతే హైదరాబాద్‌ శివారులో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఇవి కాకుండా పలువురు దర్శక, నిర్మాతలకు చిన్న చిన్న స్టూడియోలున్నాయి. ఇప్పుడు కొందరు నిర్మాతలు కూడా స్టూడియో నిర్మాణానికి ప్లాన్‌ చేస్తున్నారు. వీరితోపాటు ఇప్పుడు మరో స్టూడియో రాబోతుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ స్టూడియో రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన తెలంగాణలో స్టూడియో నిర్మించబోతున్నారు.

అందుకు తెలంగాణ ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తుండటం గమనార్హం. స్టూడియో కోసం ల్యాండ్‌ కావాలని కొన్ని రోజుల క్రితమే బాలయ్య తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా, తాజాగా శనివారం తెలంగాణ కేబినేట్‌ దానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బాలయ్య స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వ భూమిని ఇచ్చేందుకు ఓకే చెప్పింది. 
 

Latest Videos


తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన ఈ భూమిలో బాలయ్య ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో ఫిల్మ్ స్టూడియో నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నారట. షూటింగ్‌లు, ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్ ప్రొడక్షన్‌, డబ్బింగ్‌, మిక్సింగ్‌ ఇలా అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా, షూటింగ్‌కి లొకేషన్స్ కూడా అనుకూలంగా ఉండేలా బాలయ్య ఈ స్టూడియో నిర్మించాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో స్టూడియో, ఆంధ్రప్రదేశ్‌లో ఆయన బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిని నిర్మించే ఆలోచనలో ఉన్నారట.

అక్కడ బావ సీఎం చంద్రబాబు కూడా ఆసుపత్రికి స్థలం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఏక కాలంలో ఈ రెండు నిర్మాణాలు చేయాలని బాలయ్య ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్. అయితే ఇప్పటికే నందమూరి ఫ్యామిలీకి రామకృష్ణ స్టూడియో, ఎన్టీఆర్‌(నాచారం) స్టూడియో ఉన్నాయి. కానీ అవి యాక్టివ్‌గా లేవు. కానీ ఇప్పుడు కొత్తగా మరో స్టూడియోకి ప్రభుత్వం భూ కేటాయించడమే అందరిని ఆశ్చర్యపరిచే అంశం. 

ఇదిలా ఉంటే బాలయ్యకి తెలంగాణలో స్టూడియో నిర్మాణానికి స్థలం కేటాయించడం పట్ల సినీ ప్రముఖులు, తెలంగాణ వాదుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. బాలయ్య హైదరాబాద్‌ కేంద్రంగా సినిమాలు చేస్తున్నా.. ఆయన రాజకీయంగా ఏపీలో ఉన్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అలాంటిది ఒక ఆంధ్రా లీడర్‌కి తెలంగాణలో భూ కేటాయింపు ఇవ్వడమేంటనే వాదన తెలంగాణ ప్రముఖులు నుంచి వినిపిస్తుంది. తెలంగాణలో చాలా మంది ప్రముఖుల స్టూడియో నిర్మాణాలకు, ఇతర కార్యక్రమాలకు ల్యాండ్‌ కేటాయింపులు కోరగా ప్రభుత్వాలు దాన్ని దాటవేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలయ్యకి ఇంటర్నేషనల్‌ స్టూడియో నిర్మాణానికి అంత ల్యాండ్‌ ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పడమే ఆశ్చర్యంగా మారింది. 
 

chandrababu revanth reddy

అయితే దీని వెనకాల ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నమ్మిన బంటు అని ప్రతిపక్షాలు అంటుంటాయి. ఎందుకంటే రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ లోకి రావడానికి ముందు టీడీపీలోనే ఉన్నారు. ఇక్కడే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడారు. చంద్రబాబుతో కలిసి ఓటుకు నోటు కేసులో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.

ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నాడు. దీంతో ఇప్పుడు బావమర్ది బాలయ్యకి తెలంగాణలో స్టూడియో నిర్మాణానికి భూ కేటాయింపులు జరగడం వెనుక చంద్రబాబు ఉన్నట్టు, ఆయన తెరవెనుక చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ సినిమా వర్గాలు, ప్రతిపక్షాల నుంచి, సోషల్‌ మీడియాలో వినిపించే మాట ఇది. మరి ఇందులో నిజమెంతా? అసలేం జరిగింది, ఏం జరుగుతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. 

Read more: ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌ని పోస్టర్‌పై చూసి ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా? తారక్‌ చెప్పిన మాటకి నిర్మాత షాక్‌

click me!