‘బాహుబలి’ ఫస్ట్‌ డే నెగిటివ్ టాక్, భయపడ్డాం: శోభు యార్లగడ్డ షాకింగ్ కామెంట్స్

First Published | Oct 26, 2024, 7:18 PM IST

బాహుబలి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చిందని నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించారు. రెండు భాగాలుగా చిత్రాన్ని విడుదల చేయడం వెనుక ఉన్న కారణాలను, తొలిరోజు ప్రతిస్పందనపై తన ఆందోళనను ఆయన పంచుకున్నారు.

Shobu Yarlagadda,Prabhas, Baahubali, first day talk

ప్రభాస్‌ (Prabhas) హీరోగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బాహుబలి’ (Baahubali)ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే మొదటి రోజు  ఈ చిత్రానికి నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. ఆ విషయాలను ఇప్పుడు ఇంతకాలానికి గుర్తు చేసుకున్నారు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ . 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Baahubali 3 , rajamouli, Kanguva, prabhas

2015లో విడుదలైన బాహుబలి పార్ట్ 1 సినిమా గురించి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. తమ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయడానికి గల కారణాన్ని, ఫస్ట్‌ డే నెగిటివ్‌ టాక్‌ రావడంపైనా స్పందించారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. 

Latest Videos


Anushka, Prabhas, baahubali

 నిర్మాత శోభు యార్లగడ్డ  మాట్లాడుతూ...‘‘బాహుబలి’ చేయాలనుకున్నప్పుడే దానిని రెండు భాగాల్లో తెరకెక్కించాలనుకున్నాం. బడ్జెట్‌, కథకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజుల్లో పార్ట్‌-2 అనేది చాలా అరుదు. ఒక చిత్రాన్ని రెండు భాగాల్లో తెరకెక్కిస్తే చూస్తారా? సెకండ్‌ పార్ట్‌ వెంటనే విడుదల చేయకపోతే పార్ట్‌-1 మర్చిపోతారా? అని ఎన్నో సందేహాలు వచ్చాయి.

రెండు పార్ట్‌లను కలిపి ఒకేసారి షూట్‌ చేసేద్దామనుకున్నాం. పార్ట్‌-1 విడుదలైన మూడు నెలల్లోనే పార్ట్‌-2 రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశాం. సినిమా షూట్‌ మొదలయ్యాక అనుకున్న బడ్జెట్‌లో అది పూర్తికాదని అర్థమైంది. ఆవిధంగా ముందు ఫస్ట్‌ పార్ట్‌ షూట్‌ చేసి రిలీజ్‌ చేశాం’ అన్నారు.

‘‘మా సినిమా విడుదలైనప్పుడు తొలిరోజు నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమా బాలేదు, పోయిందన్నారు. తమ అంచనాలు అందుకోలేదని పలువురు అభిమానులు పేర్కొన్నారు. రెండోరోజు నుంచి రెగ్యులర్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ పెరిగారు. తొలిరోజు అలా.. రెండోరోజు ఇలా ఉండటానికి కారణాలు చాలా ఉండొచ్చు.

నా దృష్టిలో తెల్లవారుజామున వేసే షోలు ఎప్పుడూ రిస్కే. ఫ్యాన్స్‌ ఎన్నో అంచనాలతో ఆ షోలకు వెళతారు. సినిమాని మరో దృష్టి కోణంలో చూస్తారు. అది సెట్‌ కానప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అదీకాక అప్పటివరకూ వచ్చిన చిత్రాలతో పోలిస్తే ‘బాహుబలి’ చాలా విభిన్నంగా ఉంటుంది’’ అని శోభు యార్లగడ్డ చెప్పారు. 

తొలిరోజు నెగిటివ్‌ టాక్ వచ్చినప్పుడు పైకి రిలాక్స్‌గా ఉన్నా తాను లోలోపల భయపడినట్లు చెప్పారు. నిజంగానే నెగిటివ్‌ టాక్‌ వస్తే ఏం చేయాలి? తదుపరి భాగం ఎలా చేయాలి? అని ఆ సమయంలో రాజమౌళి ప్లాన్‌ చేశారన్నారు. అదృష్టవశాత్తూ తమ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుందన్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్‌’గా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. పార్ట్‌-1 విడుదలైన రెండేళ్ల తర్వాత పార్ట్‌-2ను విడుదల చేశారు.
 

‘ఈ చిత్రానికి 100కోట్లు పైగా పెట్టుబడి పెడుతున్నారు. అది తిరిగి వచ్చే అవకాశం ఉందా.. తేడా వస్తే ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడిపోతాయి. ఒక్క రాజమౌళి, ప్రభాస్, అనుష్క.. మాత్రమే ఈ ప్రాజెక్టు కు పెద్ద దిక్కు. అయినంత మాత్రాన అంత బడ్జెట్ రికవర్ అవ్వడం సాధ్యం కాదేమో’ అంటూ ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్ అయిన 7రోజుల్లోనే ‘బాహుబలి ది బిగినింగ్’ బడ్జెట్ ను మొత్తం రికవర్ చేసేసి అందరికీ షాక్ ఇచ్చింది.

‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రానికి 148కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం 302.3కోట్ల షేర్ ను వసూల్ చేసింది. అంటే జరిగిన బిజినెస్ కు డబుల్ రప్పించిందనే చెప్పాలి. ఈ చిత్రం వల్లే ఎన్నో పాన్ ఇండియా సినిమాలకు బీజం పడింది. అంతే కాదు తెలుగు సినిమాని తక్కువ చేసే మిగిలిన పరిశ్రమలు కూడా ‘బాహుబలి’ ని మించే సినిమా తియ్యాలని పరితపిస్తున్నాయి.

బాహుబలి(Baahubali The Beginning) రిలీజ్ అయిన మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది… రాజమౌళి సినిమాల్లో ఫస్ట్ టైం…నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా మునుపటి ఇండస్ట్రీ రికార్డ్ మూవీస్ ని ఇక అందుకోవడం కష్టమే అనుకున్నారు అందరూ, సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ సినిమా పోయిందని సంబరపడ్డారు. కానీ వీకెండ్ కే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమా.

Read more: ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌ని పోస్టర్‌పై చూసి ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా? తారక్‌ చెప్పిన మాటకి నిర్మాత షాక్‌

click me!