పుష్ప2 కోసం 3 ఏళ్లు పనిచేసిన అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ లో భారీ ట్వీస్ట్ ఏంటంటే ..?

First Published | Oct 26, 2024, 7:40 PM IST

పుష్ప 2 సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అల్లుఅర్జున్. చాలా రిస్క్ లు కూడా చేశాడు. భారీ టార్గెట్ లక్ష్యంగా రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప కోసం దాదాపు మూడేళ్ల శ్రమించాడు బన్నీ. మరి ఈ సినిమాకోసం అల్లు అర్జున్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? 
 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. పాన్ ఇండియన్ ఆడియన్స్.. అండ్  మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్న2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ కోసం కళ్లు కాయలు కాచేలా  ఎదురు చూస్తున్నారు అల్లు అభిమానులు. రిలీజ్ కు దగ్గరపడుతున్న కొద్ది.. ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. 

Also Read: ఎన్టీఆర్ – కృష్ణ మ‌ధ్య టైటిల్ వార్.. కొడుకుల కోసం కొట్లాడుకున్న స్టార్ హీరోలు..?


భారీ లక్ష్యంతో బరిలోకి దిగబోతున్న పుష్ప ది రూల్.. రిలీజ్ కు ముందే తన సత్తా చాటుకుంది.  ప్రిరిలీజ్ బిజినెస్ లో బెంచ్ మార్క్స్ ని  క్రియేట్ చేసింది. రిలీజ్ తరువాత రాజమౌళి రికార్డ్ లను కూడా బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు.  

ఇక పుష్ప2 రిలీజ్ కు ముందే క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ చూస్తుంటే.. సినిమా ఏరేంజ్ లో ఉంటుందా అని ఆసక్తి పెరుగుతుంది. పుష్ప2 టార్గెట్ 1000 కోట్లు దాటటమే అని టాక్ వినిపిస్తున్న క్రమంలో.. ఈసినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఏ దాదాపు 1200 కోట్లకు జరిగిందట.

ఈ లెక్కన చూసుకుంటే . ఈ సినిమా స్టామినా బాక్స్ ఆఫీస్ వద్ద 2000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు సినిమా పండితులు. అంతే కాదు పుష్ప2 ను టోటల్ గా 90 శాతం థియేటర్లలో రిలీజ్ చేయడం టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారు. 

Also Read: జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేసిన అల్లు అర్జున్, ఆ స్టేట్ లో ఐకాన్ స్టార్ దే హవా


ఇక ఈమూవీ ఓపెనింగ్స్ కూడా అంచనాల వేయలేకపోతున్నారు. మొదటి రోజు 300 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు. నాలుగైదు రోజుల్లో 1000 కోట్ల మార్క్ ను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాదు.. టాక్ గట్టిగా వస్తే మటుకు టోటల్ రన్ 2 వేల కోట్లు దాటవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈసినిమా విజయం ఈ రేంజ్ లో చూడాలని బన్నీ తపత్రేయ పడ్డాడు.

Also Read: సుకుమార్ సెంటిమెంట్, పుష్ప2 కూడా ఆయనకు చూపించాడట.

పుష్ప సినిమా తో జాతీయ అవార్డ్ ల పంట పండితే.. పుష్ప 2 తో ఆస్కార్ ను కూడా అందుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈసినిమా కోసం దాదాపు 3ఏళ్ళు కష్టపడ్డాడు బన్నీ. పుష్ప2 నుపట్టుదలతో పూర్తి చేశాడు.

గెటప్ తో పాటు.. ఈసినిమా కోసం తనను తాను కొత్తగా మేకోవర్ చేసుకున్న అల్లు అర్జున్. పుష్ప కోసం  సందీప్ వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ లాంటి టాప్ డైరెక్టర్స్ తో సినిమాలను కూడా వెయింట్ లిస్ట్ లో పెట్టాడు. 

దాంతో అందులో అట్లీ సినిమా కాన్సిల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇంత కష్టపడ్డందుకు అల్లు అర్జున్  200 కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ఇక  ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇండియా లో ఇప్పటి వరకు ఏ  హీరో కూడా అందుకోలేదని తెలుస్తోంది. 

Also Read: CID 2 వచ్చేస్తోంది, బుల్లితెర ఆడియన్స్ కు ఇక పండగే..

Rajamouli

జైలర్ కోనసం రజినీకాంత్ కు ఫస్ట్ 100 కోట్లు.. ఆతరువాత వంద కోట్లు ఇచ్చారు. ప్రభాస్ కూడా 200 కోట్లకు దగ్గరగానే ఉన్నాడు. పవన్ కూడా ఓజీ కోసం 100 కోట్లు తీసుకుంటున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా సెంచరీ కొట్టారు. ఇక రాజమౌళి సినిమాకు  మహేష్ బాబు కూడా లాభాల్లో వాటా కింద 200 కోట్ల వరకూ తీసుకోబోతున్నాడని టాక్. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

ఇలా పుష్ప2 తో ముందుగానే 200 కోట్లు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఈ రెమ్యునరేషన్ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని.. టాలీవుడ్ లో మాత్రం టాక్ గట్టిగా నడుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈమూవీని డిసెంబర్ 5 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.  వచ్చే నెలలో ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతున్నారు .

టాలీవుడ్ కు టాటా చెప్పిన కృతీశెట్టి

Latest Videos

click me!