హీరో జగపతిబాబు లెజెండ్ మూవీతోనే విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలన చిత్రం బ్యానర్లపై నిర్మితమైన లెజెండ్.. 2014 మార్చి 8న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.