టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు అల్లు అర్జున్.. మహేష్, ప్రభాస్ ని వెనక్కి నెట్టి మరీ.. ఇదెలా సాధ్యం అంటే

First Published | Sep 5, 2024, 5:04 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2 తో గట్టిగా కొట్టాలని బన్నీ బాగా ఫిక్స్ అయ్యాడు. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2 తో గట్టిగా కొట్టాలని బన్నీ బాగా ఫిక్స్ అయ్యాడు. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ మాత్రమే 100 కోట్ల వరకు ఉన్నట్లు టాక్. అయితే తాజాగా జాతీయ స్థాయిలో ఈ ఏడాది అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిన సెలెబ్రిటీల జాబితా విడుదలయింది. 

అంతా ఊహించినట్లుగానే కింగ్ ఖాన్ షారుఖ్ అత్యధికంగా ఈ ఏడాది 92 కోట్ల ఇన్ కమ్ ట్యాక్స్ కట్టి టాప్ లో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఉన్నారు. విజయ్ ఏకంగా 80 కోట్ల ట్యాక్స్ చెల్లించారు. మూడవ స్థానంలో సల్మాన్ ఖాన్ 75 కోట్ల ట్యాక్స్ తో ఉన్నారు. 


Also Read: నిశ్చితార్థం ఉంగరం చూపిస్తూ సందడి చేసిన శోభిత ధూళిపాల..నాగ చైతన్య రియాక్షన్ వైరల్

Latest Videos


నాల్గవ స్థానంలో అమితాబ్ బచ్చన్ 71 కోట్లతో ఉన్నారు. ఐదవ స్థానంలో విరాట్ కోహ్లీ 66 కోట్లతో ఉన్నారు. టాప్ 20 స్థానం దక్కించుకున్న ఏకైక టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మాత్రమే. అల్లు అర్జున్ 14 కోట్ల ట్యాక్స్ చెల్లించారు. మోహన్ లాల్ కూడా బన్నీతో సమానంగా 14 కోట్ల ట్యాక్స్ చెల్లించారు. 

Mahesh babu and Allu Arjun

సచిన్ టెండూల్కర్, రణ్వీర్ సింగ్ లాంటి వాళ్ళు టాప్ 10 లో ఉన్నారు. ఆశ్చర్యకరంగా టాప్ 20లో బన్నీ పేరు ఉంది కానీ.. ప్రభాస్, మహేష్ పేర్లు లేవు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా భారీ పారితోషికం అందుకుంటున్నారు. మహేష్ రెమ్యునరేషన్ కూడా తక్కువేం కాదు. 

మరి వీళ్లంతా ఆదాయపు పన్ను చెల్లించలేదా అనే చర్చ జరుగుతోంది. పుష్ప 2 కనుక ఆశించిన స్థాయిలో హిట్ అయితే బన్నీ కూడా బాలీవుడ్ టాప్ స్టార్స్ తో సమానంగా రెమ్యునరేషన్  సందర్భం రావచ్చు. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ వాళ్ళకి ధీటుగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. 

click me!