బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏఎన్నార్ వారసుడిగా నాగార్జున చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆరంభంలో కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి కానీ అక్కినేని వారసుడిగా నాగార్జున ఇమేజ్ పెంచే చిత్రం పడలేదు. 1990లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ చిత్రం నాగార్జున కెరీర్ నే మార్చేసింది.