ఫేడౌట్‌ అవుతున్న బాలయ్య భామలు.. తెలుగులో ఖాళీ అయిపోయిన ప్రగ్యా, సోనాల్, హనీ రోజ్‌, వేదిక

Aithagoni Raju | Published : Sep 18, 2023 5:08 PM
Google News Follow Us

బాలకృష్ణతో ఇటీవల కలిసి నటించిన హీరోయిన్లు ఇప్పుడు కనుమరుగయ్యారు. తెలుగులో ఈ భామలకు ఆఫర్లు లేకపోవడం గమనార్హం. ఓ రకంగా టాలీవుడ్‌లో వాళ్లు ఫేడౌట్‌ అయిపోతున్నారు. 
 

16
ఫేడౌట్‌ అవుతున్న బాలయ్య భామలు.. తెలుగులో ఖాళీ అయిపోయిన ప్రగ్యా, సోనాల్, హనీ రోజ్‌, వేదిక

వరుస విజయాలతో ఉన్న నందమూరి బాలకృష్ణ(Balakrishna) చివరగా `రూలర్‌`, `అఖండ`, `వీరసింహారెడ్డి` చిత్రాలతో వచ్చారు. `రూలర్‌` ఆకట్టుకోలేకపోయింది. యావరేజ్‌ రిజల్ట్ ని తెచ్చుకుంది. ఆ తర్వాత `అఖండ`తో సంచలన విజయాన్ని అందుకున్నారు. బాలయ్య ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో `వీరసింహారెడ్డి`తో ఆ సక్సెస్‌ పరంపరని కంటిన్యూ చేశారు. 
 

26

బాలకృష్ణ చివరగా `వీరసింహారెడ్డి`(Veera Simha Reddy) చిత్రంలో నటించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో శృతి హాసన్‌ ఓ కథానాయికగా, మలయాళ బ్యూటీ హనీ రోజ్‌ మరో కథానాయికగా నటించింది. సీనియర్‌ బాలయ్యకి జోడీగా చేసింది. హాట్‌ అందాలతో మంత్రముగ్దుల్ని చేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది హనీరోల్‌. ఆమె చాలా కాలంగా తెలుగులో రాణించాలని ప్రయత్నించినా గుర్తింపు రాలేదు. కానీ `వీరసింహారెడ్డి`తో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. 

36

దీంతో ఇకపై హనీ రోస్‌ (Honey Rose)తెలుగులో బిజీ అవుతుందని, సీనియర్‌ హీరోలకు పర్‌ ఫెక్ట్ జోడీ అవుతుందని భావించారు. కానీ ఇప్పటి వరకు ఈ బ్యూటీకి కొత్తగా మరే తెలుగు సినిమా రాకపోవడం గమనార్హం. టాలీవుడ్‌లో ఇక తిరుగులేదనుకుంటే సీన్‌ రివర్స్ అయ్యింది. కేవలం షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్స్ కి తప్ప సినిమా అవకాశాలను నోచుకోవడం లేదు. ఓ రకంగా ఫేడౌట్‌ పరిస్థితిలో ఉంది. 

Related Articles

46

అంతకు ముందు బాలయ్య `అఖండ` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సొంతం చేసుకున్నారు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ (Pragya Jaiswal) హీరోయిన్‌. అంతకు ముందు ఫేడౌట్‌ అవుతుందని భావించిన ఈ బ్యూటీకి పిలిచి ఆఫర్‌ ఇచ్చింది. `అఖండ` సంచలన విజయం సాధించడంతో ఇక ప్రగ్యాజైశ్వాల్కి తిరుగు లేదు అని భావించారు. కానీ సీన్‌ రివర్స్ అయ్యింది. ఒక్క ఆఫర్‌ కూడా రావడం లేదు. 
 

56

`అఖండ` కంటే ముందు బాలయ్య `రూలర్‌` చిత్రంలో నటించారు. ఇందులో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించారు. వేదిక చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మామూలుగానే ఆడింది. పెద్ద సక్సెస్‌ కాలేదు. కానీ వేదిక పాత్రకి మంచి పేరే వచ్చింది. ఇక వేదిక(Vedhika) తెలుగులోనూ బిజీ అవుతుందనుకున్నారు. కానీ ఒక్క ఆఫర్‌ కూడా లేదు. దీంతో కన్నడ, మలయాళ చిత్రాలకే పరిమితమయ్యింది. 
 

66

ఈ సినిమాలోనే సోనాల చౌహాన్‌(Sonal Chauhan) కూడా నటించింది. బాలయ్యతో వరుసగా సినిమాలు చేసింది. `లెజెండ్‌`, `డిక్టేటర్‌` మూవీస్‌లో హీరోయిన్ గా మెరిసింది. కానీ ఈ బ్యూటీకి కూడా కాలం కలిసి రావడం లేదు. తెలుగులో నాగార్జునతో `ది ఘోస్ట్`, వెంకటేష్‌తో `ఎఫ్‌ 3` చిత్రంలో నటించింది. ఇటీవల `ఆదిపురుష్‌`లోనూ మెరిసింది. మండోదరి పాత్రలో నటించింది.  కానీ ఈ బ్యూటీకి కొత్తగా ఆఫర్లు లేవు. దీంతో కేవలం ఫోటో షూట్లకే పరిమితమవుతుందీ సెక్సీ బ్యూటీ. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos