Manchu Lakshmi: స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ... సన్నజాజి తీగ నడుముతో కవ్విస్తున్న మంచు లక్ష్మి!

Published : Sep 18, 2023, 03:15 PM IST

సైమా అవార్డ్స్ ఈవెంట్లో సందడి మొత్తం మంచు లక్ష్మిదే. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా సిద్దమైన మంచు లక్ష్మి అందరినీ ఆకర్షించారు.   

PREV
17
Manchu Lakshmi:  స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ... సన్నజాజి తీగ నడుముతో కవ్విస్తున్న మంచు లక్ష్మి!
Manchu Lakshmi

సెప్టెంబర్ 15,16 తేదీల్లో దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక జరిగింది. ఈ వేడుకలు ఆహ్వానం అందుకున్న మంచు లక్ష్మి హాజరయ్యారు. వేదికపై తనదైన హోస్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిశారు. మంచు లక్ష్మి అందరి దృష్టిని ఆకర్షించారు. 
 

27
Manchu Lakshmi

విలక్షణ నటుడు మోహన్ బాబు వారసురాలైన మంచు లక్ష్మి విదేశాల్లో చదువుకుంది. ఆమె కెరీర్ అమెరికాలో మొదలైంది.  కొన్ని అమెరికన్ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన మంచు లక్ష్మి కొన్ని చిత్రాల్లో నటించారు. 

 

37
Manchu Lakshmi

కారణంగా తెలియదు కానీ హాలీవుడ్ వదిలి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక్కడ ఆమెకు బ్రేక్ రాలేదు. హీరోయిన్ గా, నటిగా అనేక ప్రయత్నాలు చేసినా స్టార్ కాలేకపోయింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం అనగనగా ఓ ధీరుడు. సిద్ధార్థ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి  విలన్ రోల్ చేసింది. 

47
Manchu Lakshmi


 ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తుంది. గుండెల్లో గోదావరి, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది. కొన్ని చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసింది. 

57
Manchu Lakshmi

ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది. 

 

67

అగ్ని నక్షత్రం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. అలాగే మరికొన్ని చిత్రాలు చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. ఇటీవల మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ వివాహం దగ్గరుండి చేసింది. మోహన్ బాబు, మంచు విష్ణుకు ఇష్టం లేకపోయినా మనోజ్-మౌనికల వివాహం చేసిందంటూ ప్రచారం జరిగింది. 

77

మంచు విష్ణుతో లక్ష్మి, మనోజ్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారు. ఇటీవల రాఖీ పండగ వేళ మనోజ్ కి రాఖీ కట్టిన మంచు లక్ష్మి... విష్ణుని కలవలేదు. దీంతో మంచు ఫ్యామిలీ విబేధాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు అయ్యింది. ఆస్తి పంపకాల విషయంలో మోహన్ బాబు తీసుకున్న నిర్ణయాలు వారసుల మధ్య చిచ్చు పెట్టాయనే వాదన ఉంది. 
 

click me!

Recommended Stories