హాఫ్ శారీలో శ్రీముఖి ఎంత ముద్దుగా ఉందో.. మనసు దోచేలా స్టార్ యాంకర్ ఫోజులు..

First Published | Sep 18, 2023, 3:50 PM IST

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతోంది. పండగవేళ హాఫ్ శారీలో ముద్దుగా రెడీ అయ్యి కుర్ర గుండెల్ని దోచేస్తోంది. బ్యూటీఫుల్ లుక్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.
 

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi)  వరుస టీవీ షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది. 
 

మరోవైపు శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో మరింత అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 
 


ఈరోజు గణేశ్ చతుర్థి (Ganesh Chaturthi) కావడంతో శ్రీముఖి సంప్రదాయ దుస్తుల్లో ముద్దుగా రెడీ అయ్యింది. హాఫ్ శారీలో బంగారు బుట్టబొమ్మలా మెరిసింది. ట్రెడిషనల్ లుక్ తో ఫ్యాన్స్ నే కాదు.. నెటిజన్లనూ కట్టిపడేసింది. చూపు తిప్పుకోకుండా చేసింది.

తాజాగా పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. పట్టుపరికిణీతో పాటు ఆకర్షణీయమైన జ్యూయెల్లరీ ధరించడంతో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. సొగసుల నిధిగా మారింది.  
 

మొదటి నుంచి శ్రీముఖి సంప్రదాయ దుస్తుల్లో అందాల వెలుగులు పూయిస్తూనే వస్తోంది. ట్రెండీ వేర్స్ లో ఎంతలా ఆకట్టుకోవాలని ఈ ముద్దుగుమ్మ ప్రయత్నించినా.. ఆమె అభిమానులు మాత్రం ఇలా నిండు దుస్తుల్లో చక్కటి రూపంలో చూసేందుకు ఇష్టపడుతుంటారు. 
 

ఇక శ్రీముఖి సైతం తన అభిమానులకు నచ్చే విధంగా ఫొటోషూట్లు చేస్తూ వస్తుంటుంది. సమయం ఉన్నప్పుడల్లా లైవ్ సెషన్స్, చాట్ సెషన్ తో సామాజిక మాధ్యామాల ద్వారా అలరిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్టులూ పెడుతుంటుంది. 
 

ఈ క్రమంలో వినాయక చవతి సందర్భంగా ఇలా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. తన అభిమానులకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపింది. అటు ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

టీవీ షోలతో బుల్లితెరపై సందడి చేస్తూనే అటు నటిగానూ పలు చిత్రాల్లో అలరిస్తోంది. గతంలో చాలా చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. రీసెంట్ గా ‘భోళా శంకర్’ మెగాస్టార్ చిరుతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. గత నెలలో ఈ మూవీ విడుదలైంది. 

Latest Videos

click me!