రాంచరణ్, ప్రభాస్ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఫస్ట్ నా సినిమా, ఆ తర్వాతే మీ నాన్న సినిమా

Published : Dec 29, 2022, 03:58 PM IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 తిరుగులేని టాక్ షో గా మారుతోంది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే.

PREV
16
రాంచరణ్, ప్రభాస్ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఫస్ట్ నా సినిమా, ఆ తర్వాతే మీ నాన్న సినిమా

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 తిరుగులేని టాక్ షో గా మారుతోంది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు.శర్వానంద్, అడివి శేష్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. 

26

సీజన్ 2లో తదుపరి ఎపిసోడ్ డిసెంబర్ 30న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యాక్షన్ హీరో గోపీచంద్ అతిథులుగా హాజరవుతున్నారు. ఇప్పటికే అనేక ప్రోమోలు విడుదలై ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేశాయి. తాజాగా మరో మరో ప్రోమో విడుదలై వైరల్ గా మారింది. 

36

ఈ షోలో బాలయ్య ప్రభాస్ ని ఎలాంటి ప్రశ్నలు అడిగారో అని ఫ్యాన్స్ ఉత్కంఠకి గురవుతున్నారు. ప్రభాస్ అంటే ఫ్యాన్స్ లో మొదట వినిపించే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని.. ఈ ప్రశ్నని బాలయ్య ప్రభాస్ ని అడిగాడు. దీని గురించి ఇద్దరి మధ్య ఫన్నీగా సంభాషణ జరిగినట్లు ఉంది. ప్రోమోలో బాలయ్య మాట్లాడుతూ.. నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి, నేను కూడా నీ మాయలో పడిపోయా అని బాలయ్య అన్నారు. 

46

అసలు పెళ్లి సంగతి ఏంటి ? ఉందా లేదా ? అని బాలయ్య ప్రశ్నించారు. నాకు ఇంకా రాసి పెట్టినట్లు లేదు సర్ అని ప్రభాస్ ఫన్నీగా బదులిచ్చాడు. దీనితో బాలయ్య..ఒరేయ్ మీ అమ్మకు చెప్పిన మాటలు నా దగ్గర చెప్పకు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

 

56

ఇంతలో బాలయ్యతో రాంచరణ్ ఫోన్ లో మాట్లాడతాడు. బాలయ్య రాంచరణ్ కి కూడా చిన్న వార్నింగ్ ఇచ్చాడు. సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు.. ఆ తర్వాత మీ నాన్న సినిమా చూడు అని చెప్పడంతో రాంచరణ్ పగలబడి నవ్వేశాడు. 

66

సంక్రాంతికి కానుకగా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు బడా హీరోలు.. అది కూడా బాలయ్య, చిరంజీవి లాంటి స్టార్లు బాక్సాఫీస్ వద్ద తలపడుతుండడంతో ఇండస్ట్రీలో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు తమ హీరో చిత్రమే విజయం సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories