నటుడు కృష్ణుడు కూతురిని చూశారా ఎంత క్యూట్ గా ఉందో... వైరల్ గా నిత్యా ఓణీల వేడుక ఫోటోలు!

Published : Dec 29, 2022, 03:16 PM IST

నటుడు కృష్ణుడు తన పదేళ్ల కూతురు ఓణీల వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు, హాజరయ్యారు.   

PREV
16
నటుడు కృష్ణుడు కూతురిని చూశారా ఎంత క్యూట్ గా ఉందో... వైరల్ గా నిత్యా ఓణీల వేడుక ఫోటోలు!
Krishnudu


చిన్న చిన్న పాత్రలతో తెలుగు పరిశ్రమలో నటుడిగా అడుగుపెట్టాడు కృష్ణుడు. ఆయనకు హ్యాపీ డేస్ మూవీ ఫేమ్ తెచ్చింది. జూనియర్స్ ని వేధించే సీనియర్స్ లో ఒకడిగా కృష్ణుడు నటించారు. 
 

26
Krishnudu

అయితే అతడికి వినాయకుడు మూవీలో హీరోగా ఆఫర్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వినాయకుడు సూపర్ హిట్ అందుకుంది. వినాయకుడు మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు.

36
Krishnudu


వినాయకుడు సక్సెస్ కావడంతో ఆయన హీరోగా వరుసగా కొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. విలేజ్ లో వినాయకుడు, పప్పు ఇలా కొన్ని చిత్రాలు తెరకెక్కాయి. విలేజ్ లో వినాయకుడు కమర్షియల్ గా ఆడకుండా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. రావు రమేష్, యండమూరి వీరేంద్రనాథ్ కీలక రోల్స్ చేశారు. 

46
Krishnudu


ఏమాయ చేశావే మూవీలో హీరో నాగ చైతన్య పాత్ర చేశారు. ఆ సినిమాలో కృష్ణుడు రోల్ చాలా బాగుంది. కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తున్న కృష్ణుడు ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆయనకు అవకాశాలు కూడా తగ్గినట్లు సమాచారం. 
 

56
Krishnudu

కాగా కృష్ణుడు తన కూతురు ఓణీల వేడుక దస్ పల్లా హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ పెద్దలు హాజరు కావడం విశేషం. కృష్ణుడు కూతురు పేరు నిత్యా అని తెలుస్తుంది. ఈ పదేళ్ల పాప చాలా క్యూట్ గా ఉంది.

66
Krishnudu

నిత్యా ఓణీల వేడుక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కృష్ణుడు కూతురిని చూసిన నెటిజెన్స్ పాప చాలా అందంగా ఉంది. చక్కని కుటుంబం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా వెళ్లిన కృష్ణుడు ప్రస్తుతం సైలెంట్ అయినట్లు తెలుస్తుంది. 
 

click me!

Recommended Stories