చిలిపి చూపులతో టెంప్ట్ చేస్తున్న త్రిష, నిండు చందమామలా మెరిసిపోతున్న తమిళ భామ

First Published | Dec 29, 2022, 2:40 PM IST

జోరుమీద ఉంది సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్. సెకండ్ ఇన్నింగ్స్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతుంది. ఒక్క సినిమాతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన త్రిష..ఇటు సోషల్ మీడియాలో కూడా తన జోరు చూపిస్తోంది. 
 

తెలుగు, తమిళ ఆడియన్స్ కు త్రిష ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్ధాలు  వరుస సినిమాలతో సందడి చేసింది త్రిష. టాలీవుడ్ ను కొన్నేండ్ల పాటు ఊపేసింది హీరోయిన్.  యంగ్ హీరోలతో పాటు.. సీనియర్ హీరోలతో కూడా ఆడిపాడింది బ్యూటీ.

 మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, బాలయ్య, వెంకటేశ్ లాంటి బడా హీరోల పక్కన సినిమాలు చేసింది బ్యూటీ.. అటు కోలీవుడ్ లో కూడా సినీ ఇండస్ట్రీలో సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష రీసెంట్ గానే రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది.
 


కుర్రాళ్ల కళల రాణిగా ఊపిన త్రిష.. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫొటోస్ లో అందాలను ఆరబోసింది. చిలిపి పోజులతో.. చిరు నవ్వులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. త్రిష ఫోజులకు ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

రీసెంట్ గా త్రిష 20 ఏళ్ల సినిమా జీవితాన్ని  పూర్తిచేసుకుంది. హీరోయిన్ గా కెరీర్ లో డౌన్ అయ్యే కొద్ది.. విమెన్ సెంట్రిక్ మూవీస్ లో మెరిసిన బ్యూటీ.. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ మూవీతో్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. హీరోయిన్ గా మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్ తో సాలిడ్ హిట్ ను అందుకుంది. ఈమూవీలో ఐశ్వర్యా రాయ్ ఉన్నా.. త్రిష పాత్రకే మంచి పేరు వచ్చింది. దాంతో త్రిష డిమాండ్ అమాంతం పెరిగింది కోలీవుడ్ లో.  

ప్రస్తుతం త్రిష తమిలంలో రాంగీ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. లైకా ప్రొడక్షన్స్ లో ఎం సరవన్ దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ గా రూపుదిద్దుకుంది. డిసెంబర్ 30న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. 
 

వయసు పెరుగుతున్నా కొద్ది  తన అందం అభినయంతో బాగా ఆకట్టుకుంటూ ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనే ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. అయితే  దీనిపై త్రిష తాజాగా కీలక ప్రకటన చేసింది. తాను రాజకీయాల్లోకి రాబోనని వెల్లడించారు. 

Latest Videos

click me!