సరదాకి సినిమాల్లోకి వచ్చి.. కమెడియన్ గా స్థిరపడిన నటుడు సుమన్ శెట్టి.. రీసెంట్ గా బిగ్ బాస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సుమన్ శెట్టి.. తన జీవితంలో డైరెక్టర్ తేజాను దేవుడిలా కొలుస్తుంటాడు. తేజాతో పాటు సుమన్ శెట్టి అంతలా అభిమానించే హీరో ఎవరో తెలుసా?
యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేయలేదు.. స్టూడియోల చుట్టు తిరగలేదు, అనుకోకుండా.. అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని.. టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సుమన్ శెట్టి. జయం సినిమాలో అధ్యక్షా.. అంటూ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సుమన్ శెట్టి, మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో ఆయన ప్రదర్శించిన నటనకు మంచి స్పందన రావడంతో, ఆ తర్వాత కమెడియన్‌గా .. సోలో హీరోగా కూడా పలు సినిమాల్లో నటించాడు. అయితే కాలక్రమేణా అవకాశాలు తగ్గడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.
24
బిగ్ బాస్ తో మళ్లీ ఫామ్ లోకి సుమన్ శెట్టి..
ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా కనిపించడంలేదు సుమన్ శెట్టి.. చాలా కాలం విరామం తర్వాత సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అడుగుపెట్టాడు. బిగ్ బాస్ లో సుమన్ పెద్దగా టాస్కులు ఆడింది లేదు, ఎంటర్టైన్ చేసింది లేదు. కానీ ఆయనకు ప్రేక్షకులు ఓట్లు వేసి... 14 వారాలు హౌస్ లో ఉంచారు. సుమన్ శెట్టి కంటే మంచిగా ఆడేవారు ముందుగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యివెళ్లిపోయారు. కానీ సుమన్ మాత్రం ఆశ్చర్యకరంగా 14 వారాలు నెట్టుకొచ్చాడు. చాలా మంది సుమన్ శెట్టి టాప్ 5లో కూడా ఉంటాడేమో అని అనుకున్నారు. కొంత మంది మాత్రం సుమన్ ని కావాలనే బిగ్ బాస్ కాపాడుకుంటూ వచ్చాడని అన్నారు.
34
సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే వ్యక్తి ఎవరు?
సుమన్ శెట్టి తన జీవితంలో దేవుడిలా కొలిచే వ్యక్తి డైరెక్టర్ తేజ. ఆయన జయం సినిమాతో ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చాడని, అందుకే జీవితాంత ఆయనకు కృతజ్ఞతతో ఉంటాని సుమన్ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించాడు. అంతే కాదు తాను కట్టుకున్న ఇంట్లో ఒక గదిని తేజ కోసం ఉంచి.. దాంటోఆయన ఫోటో పెట్టుకుని..రోజూ శుభ్రం చేస్తున్నాడు. అయితే ఇండస్ట్రీలో తేజతో పాటుసుమన్ శెట్టి మరో వ్యక్తిని కూడా అంతలా ఆరాధిస్తారట. ఆయన మరెవరో కాదు... టాలీవుడ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుమన్ శెట్టి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈక్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ గురించి సుమన్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు. ఒకరు దర్శకుడు తేజ మరొకరు పవన్ కళ్యాణ్, ఒకరు నాకు జీవితం ఇచ్చారు. ఇంకొకరు నేను ఖాళీగా ఉంటే.. నన్ను గుర్తుపెట్టుకుని అవకాశం ఇచ్చారు.సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక చిన్న పాత్ర ఉంటుంది. ఆ పాత్రను సుమన్ శెట్టి చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుని మరీ నాకు ఆ అవకాశం వచ్చేలా చేశారు. పాత్ర చిన్నదే అయినా, నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి అవకాశం ఇవ్వడం నాకు చాలా స్పెషల్ మూమెంట్” అని సుమన్ శెట్టి అన్నారు.