ఇక బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్` మూవీ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు.
శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించగా, బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఈ మూవీ ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఫస్టాఫ్ అదిరిపోయిందని, సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని అన్నారు. కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని సాధించిందీ మూవీ.