రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 'ఫౌజీ' రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ (Prabhas role in Fauji)ది బ్రాహ్మణ యువకుడి పాత్ర అని సమాచారం. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉంటాయట. సుమారు 30 నిమిషాల పాటు ఉండే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం హీరోయిన్ గా సాయి పల్లవిని అడుగుతున్నారట.
ఆవిడతో పాటు మరికొంత మంది కూడా లిస్టులో ఉన్నారని, అయితే దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవి అని వినిపిస్తోంది. రీసెంట్ గా ఆమెను కలిసి కథ, ఆ క్యారెక్టర్ గురించి చెప్పారని అయితే ఇంకా ఫైనల్ కాల్ తీసుకోలేదని అంటున్నారు.