Published : Aug 08, 2025, 04:16 PM ISTUpdated : Aug 08, 2025, 04:18 PM IST
ఈ షోలో అమర్ మాట్లాడిన మాటలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. ఇప్పటి వరకు తన గురించి పలు షోల్లో చాలా సార్లు మాట్లాడిన అమర్.. ఈ ఇంటర్వ్యూలో మాత్రం చాలా కొత్త విషయాలు తెలియజేశాడు.
మాస్ మహారాజా అనగానే మనందరికీ రవితేజ గుర్తుకు వస్తారు. అదే.. జూనియర్ మాస్ మహారాజ్ అనగానే.. బుల్లితెర నటుడు, బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ గుర్తుకు వస్తాడు. సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్.. బిగ్ బాస్ తర్వాత.. మరింత మంది ఫ్యాన్స్ ని పెంచుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత నీతోనే డ్యాన్స్ షో చేశాడు. భార్యతో కలిసి చేసిన ఈ షోలో విజయం సాధించాడు. ఆ తర్వాత కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అనే ప్రోగ్రామ్ చేశాడు. రెండు సీజన్ లలోనూ మెరిశాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు.
24
వర్ష ఇంటర్వ్యూకి అమర దీప్
అయితే, తాజాగా జబర్దస్త్ వర్ష యాంకర్ గా చేస్తున్న కిసిక్క్ టాక్స్ కి గెస్ట్ గా వచ్చాడు. ఈ షోలో అమర్ మాట్లాడిన మాటలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. ఇప్పటి వరకు తన గురించి పలు షోల్లో చాలా సార్లు మాట్లాడిన అమర్.. ఈ ఇంటర్వ్యూలో మాత్రం చాలా కొత్త విషయాలు తెలియజేశాడు. గతంలో తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను అని చెప్పడం గమనార్హం.
34
రవితేజ పై అభిమానం పంచుకున్న అమర్..
మొదటగా.. ప్రోమోలో.. అమర్ ని తమ్ముడూ అంటూ ప్రేమగా వర్షా ఆహ్వానించింది. ఆ తర్వాత రాఖీ సందర్భంగా రాఖీ కూడా కట్టింది. రవితేజ అంటే తనకు ఉన్న అభిమానాన్ని అమర్ తెలియజేశాడు. సింధూరం మూవీ అప్పటి నుంచి తాను రవితేజ అభిమానిని అని చెప్పాడు.ఆయను కలిసిన సందర్భాన్ని కూడా పంచుకున్నాడు.
ఇక, తేజూ తన జీవితంలోకి రావడం తన అదృష్టం అని, దేవుడు ఇచ్చిన వరం అని చెప్పాడు.అప్పుడప్పుడు దీనితో తలనొప్పిరా బాబు అనే ఫీలింగ్ కూడా కలుగుతుందని అని సరదాగా చెప్పాడు.
ఇక వర్ష.. తన ఇంటర్యూకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమాజిక అంశం గురించి ప్రశ్నిస్తూ ఉంటుంది. అదేవిధంగా.. అమర్ ని కూడా ‘ ఓవర్ థింకింగ్ చేసి చాలా మంది సూసైడ్ చేసేసుకుంటున్నారు..అలాంటి వారికి నువ్వేమి చెబుతావ్’ అని ప్రశ్నించింది. దానికి అమర్ ‘ అందుకు నేనే ఎగ్జాంపుల్. నేనే పెద్ద ఓవర్ థింకర్. నేనే చాలా ఎక్కువగా థింక్ చేశాను. కానీ అది నాకు తెలీదు. ఎందుకంటే నా మెంటల్ స్టేటస్ ఈజ్ నాట్ గుడ్’ అని చెప్పి షాకిచ్చాడు.
గతంలో తాను చాలా మందిని బాధ పెట్టానని.. ఇప్పుడు అది కర్మ రూపంలో తనకు తగులుతోందని చెప్పాడు. అంతేకాకుండా.. తాను గతంలో ఆత్మహత్యాయత్నాం కూడా చేశానని చెప్పి షాకిచ్చాడు. ఇక తన జీవితంలో అన్నీ వెన్నుపోటులే ఉన్నాయి అని చెప్పాడు. తనను జీవితంలో పైకి తీసుకురావడానికి వాళ్ల అమ్మ చాలా కష్టపడిందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.