Balakrishna: వెంకటేష్‌ కోసం తన 50 ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య.. చిరు, నాగ్‌ల కోసం ఇలా చేయలేదు

Published : Dec 12, 2025, 06:01 PM IST

నందమూరి బాలకృష్ణ.. చిరంజీవికి క్లోజ్‌గానే ఉంటారు. ఆయనకంటే జోవియల్ గా వెంకటేష్‌ విషయంలో ఉంటారు. ఆ విషయాన్ని చాటి చెప్పిన ఒకే ఒక్క సందర్భం. తన 50ఏళ్ల సెంటిమెంట్‌ని కూడా ఆయన కోసం పక్కన పెట్టారు బాలయ్య. 

PREV
16
`అఖండ 2`తో బాలయ్య రచ్చ.. పుట్టిన రోజు సందడిలో వెంకీ

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2` చిత్రంతో బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో బాలయ్యకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో విక్టరీ వెంకటేష్‌ శనివారం(డిసెంబర్‌ 13న) తన 65వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించి ఒక క్రేజీ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. వెంకటేష్‌ కోసం బాలయ్య తన 50ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టడం విశేషం.  

26
వెంకటేష్‌ కోసం తన సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇన్నాళ్ల కెరీర్‌లో ఆయన తన తండ్రి ఎన్టీ రామారావుతో కలిసి చాలా సినిమాలు చేశారు. కొన్ని మల్టీస్టారర్ చిత్రాలు కూడా చేశారు. గెస్ట్ రోల్‌ చేసింది కూడా తండ్రి సినిమాల్లోనే. మిగిలిన ఏ హీరో సినిమాల్లోనూ ఆయన గెస్ట్ గా కనిపించలేదు. దాన్ని ఆయనొక సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అప్పట్లో మంచు మనోజ్‌ నటించిన `ఊ కొడతారా ఉలిక్కి పడతారా` చిత్రంలోనే ముఖ్య పాత్రలో కనిపించారు, కానీ గెస్ట్ రోల్‌ కాదు. కానీ వెంకటేష్‌ విషయంలోనే తన సెంటిమెంట్‌ని పక్కన పెట్టాడు బాలయ్య.

36
వెంకటేష్‌ `త్రిమూర్తులు` మూవీలో గెస్ట్ రోల్

వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి వారు హీరోలుగా నటించిన సినిమా `త్రిమూర్తులు`. కె మురళీ మోహనరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1987లో విడుదలైంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక ప్రత్యేకమైన మూవీగా నిలిచింది. ఎందుకంటే ఈ సినిమాలో అనేక మంది స్టార్స్ నటించారు. ఓ పాటలో చిత్రపరిశ్రమ నుంచి బిగ్‌ స్టార్స్ తళుక్కున మెరవడం విశేషం. ఇందులో వెంకటేష్‌ కోసం బాలయ్య కూడా కనిపించారు. గెస్ట్ రోల్స్ చేయననే తన సెంటిమెంట్‌ని పక్కన పెట్టి పాటలో ఆయన కూడా మెరిశారు. చిరంజీవి, నాగార్జున వంటి వారి సినిమాల్లోనూ ఎప్పుడూ ఆయన కనిపించలేదు. కానీ వెంకీ కోసమే సాహసం చేశారు బాలకృష్ణ. మళ్లీ ఆ తర్వాత కూడా ఎప్పుడూ ఆయన ఇలా కనిపించింది లేదు.

46
టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా సందడి చేసిన ఒకే ఒక సినిమా

ఇక ఈ సినిమాతో బాలయ్యతోపాటు చిరంజీవి, నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, మురళీ మోహన్‌, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు. ఇలా ఇండస్ట్రీలోని టాప్‌ స్టార్స్ అంతా ఇందులో గెస్ట్ లుగా కనిపించారు. అలా ఈ మూవీ చాలా ప్రత్యేకతని సంతరించుకుంది. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌ బాబు వంటి రెండో తరం హీరోలు, చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్‌ వంటి మూడో తరం నటులు కలిసి నటించిన ఒకే ఒక సినిమా `త్రిమూర్తులు` కావడం విశేషం.

56
బాలయ్యే కాదు స్టార్‌ హీరోయిన్లు కూడా

హీరోలే కాదు హీరోయిన్లు కూడా చాలా మంది నటించారు. విజయశాంతి, రాధా, భనుప్రియా, శారద, రాధిక, సుమలతతోపాటు శోభన, ఖుష్బూ, అశ్విని వంటి వారు నటించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయం చెందింది. బాలీవుడ్‌లో వచ్చిన `నసీబ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. అక్కడ మంచి విజయం సాధించింది. తెలుగులో మాత్రం డిజప్పాయింట్‌ చేసింది. ఇక రేపు పుట్టిన రోజు జరుపుకుంటున్న వెంకటేష్‌ ప్రస్తుతం `ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెం 47`లో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు చిరంజీవి హీరోగా రూపొందుతున్న `మన శంకరవర ప్రసాద్‌గారు` చిత్రంలోనూ గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. ఇది సంక్రాంతికి విడుదల కానుంది.

66
`అఖండ 2`తో బాక్సాఫీసు వద్ద రచ్చ

ఇక బాలయ్య వరుసగా నాలుగు హిట్లు అందుకొని జోరుమీదున్నారు. ఇప్పుడు `అఖండ 2`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నేడు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. సినిమా ఫలితంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దీంతోపాటు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎన్బీకే 111 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవలే ప్రారంభించుకుంది. హిస్టారికల్‌ కథతో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories